IND vs ENG : అభిషేక్‌ శర్మ రికార్డుల వర్షం.. ఐదో టీ20లో బాదుడే బాదుడు!

ఇంగ్లండ్ తో ఐదో టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. 17బంతుల్లో హాఫ్‌సెంచరీ బాది వేగవంతమైన ఫిఫ్టీ చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. అలాగే 37బంతుల్లోనే సెంచరీ బాది భారత్‌ తరఫున టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా ఉన్నాడు.

New Update
Abhishek Sharma creates records in India vs England fifth T20

Abhishek Sharma creates records in India vs England fifth T20

భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ విజృంభించి ఆడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము దులిపేస్తున్నాడు. ఇదేం బ్యాటింగ్ రా బాబు అంటూ కొందరు.. చూస్తే ఇలాంటి బ్యాంటింగే చూడాలటూ ఇంకొందరు తెగ గుసగుసలాడుకుంటున్నారు. 

అభిషేక్ రెండు రికార్డులు

ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ రెండు రికార్డులు సృష్టించాడు. మొదటిది 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి అత్యంత వేగవంతమైన ఫిఫ్టీల లిస్ట్ లో చేరిపోయాడు. ఇందులో రెండో స్థానంలో నిలిచాడు. అలా చెలరేగి ఆడుతున్న అభిషేక్ మరికొన్ని బంతులను ఎదుర్కొని ఇంకో రికార్డు క్రియేట్ చేశాడు. 

Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

ఈ సారి 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో ప్లేయర్ గా ఇక్కడ నిలిచాడు. మొదటి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు 35 బంతుల్లో వంద పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలా అభిషేక్ తన బ్యాట్ తో బాల్ ను తుక్కు తుక్కు చేస్తున్నాడు. 

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా ఈ సిరీస్ ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో గెలిచేసింది. అయితే ఈ చివరి మ్యాచ్ లో గెలిచి ఆ విజయంతో వన్డే సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ జట్టు చూస్తోంది. మరోవైపు విజయంతో సిరీస్ పూర్తి చేయాలని టీమిండియా చూస్తోంది. చూడాలి మరి ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుందో.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు