/rtv/media/media_files/2025/07/31/ind-vs-eng-5th-test-match-2025-07-31-12-50-55.jpg)
IND Vs ENG 5th Test match
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో ఇవాళ (జూలై 31) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ ఒకే ఒక్కటి గెలిచింది. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల విజయాలతో ముందు వరుసలో ఉంది. మరొక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ ఓవైపు చివరి టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. మరొవైపు భారత్ ఈ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-2తో సమం చేయాలని చూస్తోంది.
Also Read:ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా ప్లేయింగ్ 11పై పడింది. ఇంగ్లీష్ జట్టు ఇప్పటికే తన ప్లేయింగ్ 11 ను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీమిండియా జట్టుకు సంబంధించి ఓ అప్డేట్ బయటకొచ్చి వైరల్‌గా మారింది. ఈ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా జట్టులో నాలుగు మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
IND Vs ENG 5th Test Match
కొన్ని నివేదికల ప్రకారం.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్ 11లో 4 పెద్ద మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో బౌలింగ్‌ను బలోపేతం చేయడానికి.. అన్షుల్ కాంబోజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభిస్తుందని సమాచారం.
జస్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటే అతడి స్థానంలో ఆకాశ్‌దీప్ ప్లేయింగ్ 11లోకి తిరిగి రావడం ఖాయం అని సమాచారం.
వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఇలా ఈ నాలుగు మార్పులు టీమిండియా జట్టు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read:YS జగన్‌కు గుడ్‌న్యూస్.. విజయమ్మ, షర్మిలపై జగన్ పైచేయి
కాగా ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్‌కు గతంలో అవకాశాలు వచ్చినప్పటికీ.. వారు తమను తాము నిరూపించుకోలేకపోయారు. అలాగే గాయం కారణంగా ఆకాశ్‌దీప్ గత మ్యాచ్‌లో ఆడలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు గత 2 మ్యాచ్‌లుగా జురెల్ వికెట్ కీపర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు వీరిలో మార్పులు జరగనున్నట్లు సమాచారం.