మిచెల్ స్టార్క్ చేతిలోనే మూడు వికెట్లు.. మొత్తం ఎన్ని వికెట్లంటే?

భారత్-ఆస్ట్రేలియాకి రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికే స్టార్క్ చేతిలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ కూడా స్టార్క్ చేతిలోనే వికెట్ కోల్పోయారు.

New Update
aus (1)

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం అడిలైడ్ వేదికగా జరుగుతోంది. దీన్నే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అని కూడా అంటారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభంలోనే ఇండియాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదటి బంతికే టీమిండియా వికెట్ కోల్పోయింది.

ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

మొదటి బంతికే..

ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్(37), శుభమన్ గిల్(31), కోహ్లీ(7) ఔట్ అయ్యారు. రిషబ్ పంత్ క్రీజులోనే ఉన్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ 23 బాల్స్‌కి 3 రన్‌లతో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్, నితీశ్ కుమార్ క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ 5 వికెట్లు కోల్పోయింది.  

ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

ఇది కూడా చూడండి:  రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు