Ind vs Aus: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఎలాగైనా గెలుస్తారని భావించిన చివరి టెస్టులో మరోసారి ఫేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 157 పరుగులకు కుప్పకూలగా 157 లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా చేధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 స్కోర్ చేయగా.. ఆసీస్ 181కే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లలో పంత్ మినహా 61.. యశస్వి 22, రాహుల్13, శుభ్‌మన్ 13, కోహ్లి 6, , జడేజా 13, నితీశ్ 4, వాసింగ్టన్ 12 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బొలండ్ 6, కెప్టెన్ కమిన్స్ 3, వెబ్ స్టర్ 1 వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ భారత బౌలర్ బుమ్రా దక్కించుకోగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బోలండ్ కు దక్కింది. Ready to defend their World Test Championship mace 👊Australia qualify for the #WTC25 Final at Lord's 🏏More 👉 https://t.co/EanY9jFouE pic.twitter.com/xcpTrBOsB8 — ICC (@ICC) January 5, 2025 భారత్ ఖాతాలో రెండు రికార్డులు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బుమ్రా ఇప్పటిదాకా 32 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ బేడి (5 మ్యాచ్‌ల్లో 23.87 సగటుతో 31 వికెట్లు)ని రికార్డు బ్రేక్ చేశాడు. ఇక రిషబ్ పంత్ టెస్టుల్లో భారత్ తరఫున రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ అతనే చేశాడు. 2022లో శ్రీలంకపై 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పంత్.. ఈ మ్యా్చ్ లో 29 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. The stage is set for a dramatic day three at the SCG 🏟️#AUSvIND live 📲#WTC25https://t.co/Q1cgoHqbFV — ICC (@ICC) January 4, 2025 ఇదిలా ఉంటే.. ఇటీవలే స్వేదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తో దారుణ ఓటమిపాలైన టీమ్ ఇండియా ఈ సిరీస్ లోనైనా సత్తా చాటుతుందని భావించారు. కానీ అనుకున్నదానికంటే భిన్నంగా ప్రదర్శన చేశారు. మొదటి టెస్టు మినహా.. మిగతా మూడు టెస్టుల్లో చెత్తగా ఆడారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా మినహా పెద్దగా ఎవరూ రాణించలేరు. బ్యాటింగ్ విభాగంలో జైస్వాల్, నితీష్ రెడ్డి, పంత్ తప్పా మరెవరూ ప్రభావం చూపలేకపోయారు. సీనయర్లు కోహ్లీ, రోహిత్, జడేజా దారుణంగా విఫలమయ్యారు. కనీసం మ్యాచ్ ను డ్రా చేసేందుకు కూడా సాహసం చేయలేకపోయారు. దీంతో క్రికెట్ లవర్స్ మరోసారి దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక చాలు స్వస్తి పలకండి అంటూ విమర్శలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. కొత్త తరం సత్తా చాటేందుకు సిద్దంగా ఉందంటూ రోహిత్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.