పాకిస్థాన్‌కి ఝలక్‌ ఇచ్చిన ఐసీసీ

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు పాకిస్థాన్‌కి రాదని, భారత్‌తో జరిగే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ పాక్‌కి తెలిపింది. దీనికి పాక్ ఒప్పుకోకపోతే.. టోర్నీని వేరే దేశానికి పంపుతామని ఐసీసీ తేల్చి చెప్పింది.

New Update
Champions Trophy

ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పాక్ భావిస్తోంది. అయితే పాకిస్థాన్‌లోనే ఈ ట్రోఫీ జరిగితే.. టీమిండియా జట్టు వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి ప్రకటించింది. ఎలాగైన పాకిస్థాన్‌కి టీమిండియా జట్టును రప్పించాలని పాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైబ్రిడ్  మోడల్‌కి కూడా పాకిస్థాన్ ఒప్పుకోలేదు. అయితే పాకిస్థాన్‌కి ఐసీసీ ఝలక్‌ ఇచ్చింది.

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకోకపోతే..

ఈ ట్రోఫీలో భారత్‌తో ఆడే మ్యాచ్‌లను వేరే దేశానికి పంపించాలని, లేకపోతే  హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకోవాలి. లేకపోతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఇతర దేశానికి పంపిస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది. ఎలాగైన హైబ్రిడ్ విధానానికి పాకిస్థాన్ ఒప్పుకోవాల్సిందే. దీనికి ఒప్పుకోకపోతే ఛాంపియన్స్ టోర్నీని వేరే దేశానికి పంపడానికి ఐసీసీ రెడీగా  ఉంది. 

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

దీంతో పాకిస్థాన్‌కి రావాల్సిన డబ్బు కూడా రాదు. దాదాపుగా రూ.296 కోట్లు పాకిస్థాన్‌కి నష్టం వస్తుంది. అదే హైబ్రిడ్ విధానానికి పాక్ ఒకే అనుకుంటే.. కేవలం భారత్‌తో జరిగే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే..ఐసీసీకి ప్రసారదారు రూపాయి కూడా ఇవ్వదు. దీంతో కేవలం పాకిస్థాన్‌కే కాకుండా ఐసీసీకి కూడా భారీ నష్టం వస్తుంది.

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

ప్రస్తుతం పాకిస్థాన్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఇస్లామాబాద్‌లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం కరెక్ట్ కాదు. పాక్‌లో భారత్ చివరిగా 2008లో పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పాక్‌లో ఇండియా పర్యటించలేదు.

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు