/rtv/media/media_files/2025/02/01/mzMTDJivkseAfOjEeRUS.jpg)
kohli salary
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపుగా 12ఏళ్ల తరువాత రంజీ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కోహ్లీ ఆడుతుండటంతో అతని ఆటను చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. చాలా రోజల తరువాత రంజీ మ్యాచ్ లు ఆడుతున్న కోహ్లీ ఎంత జీతం తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రంజీ మ్యాచ్ కోసం కోహ్లీ రోజుకు రూ. 60 వేల జీతం అందుకోనున్నాడు. మ్యాచ్ జరిగే నాలుగురోజులకు కలిపి మొత్తం రూ .2లక్షల 40 వేల పారితోషకాన్ని అందుకుంటాడు. 40 కంటే ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.60,000, 21-40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.50,000. 20 కంటే తక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.40,000 వరకు ఇస్తారు. జట్టుకు ఎంపికై ఆడని సభ్యులకు వారి అనుభవ స్థాయి ఆధారంగా రోజుకు రూ.20,000 నుండి రూ.30,000 వరకు చెల్లిస్తారు.
కోహ్లీ అట్టర్ ప్లాప్
కోహ్లీ ఇప్పటివరకు డొమెస్టిక్ సర్క్యూట్‌లో 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా.. కేవలం వ23 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. రంజీ ట్రోఫీ ఆటగాళ్లకు వారి అనుభవం, వారు ఆడిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా వేతనాన్ని అందజేస్తారు. ఇక రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ అట్టర్ ప్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యాడు. 15 బంతులు ఎదురుకున్న కోహ్లీ.. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read : తిరుపతి లడ్డూ తయారీని పరిశీలించిన టీటీడీ చైర్మన్.. అధికారులకు కీలక ఆదేశాలు!
Virat Kohli: Came out after 12 years, finished in 15 balls🏏🏏🏏👏👏
— SportsScoop (@cricfanclub79) February 1, 2025
India's star batsman Virat Kohli came out to play in Ranji Trophy after 12 years, but his innings ended in just 15 balls. Playing for Delhi against Railways, Kohli was bowled by fast bowler Himanshu Sangwan… pic.twitter.com/XcvTlyBD7p