/rtv/media/media_files/2025/04/19/pAq1IqFhW7t6vqlRVO0K.jpg)
GT vs DC IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ క్రీజ్‌లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో అభిషేక్ విజృంభించాడు. ఏకంగా మొదటి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. అయితే అభిషేక్ దూకుడు ఎక్కువ సమయంలో నిలవలేకపోయాడు. 9 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. అతడు కూడా దూకుడుగా ఆడాడు. అయితే బౌలర్ ప్రసిద్ధ్ సూపర్ యార్కర్ వేయడంతో కేఎల్ రాహుల్ (28) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజ్‌లో అక్షర్ పటేల్ వచ్చాడు. మరోవైపు కరుణ్ నాయర్ వేగంగా ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.
7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు రాబట్టారు. నిలకడగా ఆడుతున్నారు అనుకున్న సమయంలో కరుణ్ నాయర్ (31) పెవిలిన్‌బాట పట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లలో ఢిల్లీ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో అక్షర్ పటేల్, స్టబ్స్ ఉన్నారు.