/rtv/media/media_files/2025/06/08/SU27uPHdilk9bsqP8wt0.jpg)
Coco Gauff
మట్టి కోర్టులో కొత్త విజేత అయింది. సెరెనా విలియమ్స్ తరువాత అమెరికా స్టార్ కోకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్ వన్ సబలెంకాను ఓడించి మరీ టైటిల్ ను ఎగురేసుకుపోయింది. నిన్న హోరాహోరీగా జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్స్ లో కోకో 6-7 (5-7), 6-2, 6-4 స్కోర్ తో కప్ ను సొంతం చేుకుంది. మ్యాచ్‌లో గాఫ్ మూడు ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది. రెండు ఏస్‌లు, 37 విన్నర్లు కొట్టిన సబలెంకా.. ఏకంగా 70 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సబలెంకా 6, గాఫ్ 8 డబుల్ ఫాల్ట్‌లు చేశారు. గాఫ్ 9 సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. సబలెంక 6 బ్రేకులు సాధించింది.
కోకో గాఫ్ కు రెండో గ్రాండ్ స్లామ్..
కోకో గాఫ్ కు ఇది రెండో గ్రాండ్ స్లామ్. అంతకు ముందు 2023లో యూఎస్ ఓపెన్ గెలిచింది. అప్పుడు కూడా సబెలెంకా మీదనే ఈమె నెగ్గింది. 2015 సెరెనా తర్వాత కోకో నే ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్నక్రీడాకారిణిగా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మొత్తం 2 గంటల 38 నిమిషాల పాటూ జరిగింది. తొలి సెట్‌లోనే ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. లాంగ్ ర్యాలీలు, ఉత్కంఠభరితమైన డ్యూస్ గేమ్‌లతో సాగిన సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు ఒకరి సర్వీసును ఒకరు బ్రేక్ చేసుకున్నారు. రెండు గేమ్ లు అయ్యేసరికి ఇద్దరూ చెరో ఒకటి నెగ్గి సైట్ టై బ్రేక్ కు వెళ్ళారు. ఇందులో మొదటి సెట్ సబెలెంకానే గెలిచింది. అయితే రెండో సెట్ కు వచ్చేసరికి గాఫ్ పై చేయి సాధించింది. నిలకడగా బేస్ లైన్ గేమ్ ఆడుతూ సబలెంకను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ మొత్తం గేమ్ అంతా కోకో, సబెలెంకా ఇద్దరూ చెరో సెట్ గెలుస్తూ వచ్చారు. చివర వరకు ఎగవరు టైటిల్ విన్నర్ గా గెలుస్తారనేది చెప్పడం కష్టం అయింది. అయితే లాస్ట్ సెట్ లో కోకో గాఫ్ సర్వీస్ ను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ గెలిచి..ఫ్రెంచె ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
Also Read: Bengaluru: బెంగళూరు తొక్కిసలాటలో కుట్రకోణం? ఎన్ఐఏ దర్యాప్తు