తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో భారత్ యువ ఆటగాళ్లు 61 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో సంజు సాంసన్ సెంచరీతో చెలరేగాడు.

india1
New Update

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. నాలుగు సిరీస్‌లో భాగంగా యువ ఆటగాళ్లు 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. భారత్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 8 వికెట్లలో 202 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు అయితే దక్షిణాఫ్రికాను కేవలం 17.5 ఓవర్లనే 141 పరుగులకే ఔట్ అయ్యారు. ఓపెనర్‌గా దిగిన సంజు సాంసన్ సెంచరీతో చెలరేగాడు. 

ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?

సంజు శాంసన్ పరుగుల బాదుడు..

ఓపెనర్‌గా వెళ్లిన సంజు శాంసన్ 107 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉండగా, పది సిక్సర్లు కొట్టాడు. సంజుతో పాటు తిలక్ వర్మ కూడా 33 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో ఇండియా రాణించడంతో టీమిండియా మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. మొత్తం నాలుగు సిరీస్‌లో భాగంగా.. రెండో టీ20 ఆదివారం జరగనుకుంది. 

ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

భారత్ ఆటగాళ్లు కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా మొదటి నుంచి బౌలర్లు కూడా సత్తా  చాటారు. మార్‌క్రమ్‌ను అర్షదీప్ వికెట్ కొట్టగా.. వెంటనే ట్రిస్టన్ స్టబ్స్, అవేశ్ ఖాన్‌ను సూర్య వికెట్ తీశారు. భారత్ బౌలింగ్ దెబ్బకు సఫారీలు తొందరగానే అలౌట్ అయ్యారు. 

ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!

భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (7) పరుగులు చేయగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ (33), హార్ధిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11), అక్షర్ పటేల్ (7), అర్ష్‌దీప్ సింగ్ (5) పరుగులు చేశారు. సంజు శాంసన్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తం మీద 107 పరుగులు తీశాడు. మొత్తానికి యువ ఆటగాళ్లు మొదటి టీ20 మ్యాచ్‌లో రాణించారు.

ఇది కూడా చదవండి:  ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు

#sa-vs-ind
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe