CSK: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్.. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కోచ్‌ క్లారిటీ.. ఇక పరిగెత్తలేడంటూ!

ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా స్థాయిలో పరిగెత్తలేడని చెప్పాడు. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయడం కష్టమని, మోకాళ్లు సహకరించట్లేదన్నాడు. కానీ అవసరమైనపుడు ముందే దిగుతాడన్నారు. 

New Update
Dhoni: ఇలా అంతా అయిపోయాక కొట్టే బదులు ముందే దిగొచ్చు కదా సర్!

CSK coach Fleming clarity on Dhoni batting order

CSK: ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ క్లారిటీ ఇచ్చాడు. అతను ఆలస్యంగా బ్యాటింగ్ చేయడానికి బలమైన కారణం ఉందన్నారు. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ.. ఇటీవలే సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా బెంగళూరుతో మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మ్యాచ్‌ పరిస్థితినిబట్టి ధోనీ బ్యాటింగ్‌ స్థానాన్ని నిర్ణయించుకుంటాడని ఫ్లెమింగ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

బ్యాటింగ్‌ చేయలేడు..

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఫ్లెమింగ్.. 'ధోని పూర్తిగా స్థాయిలో పరిగెత్తలేడు. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయలేడు. అతని బాడీ, మోకాళ్లు ఒకప్పటిలా లేవు. బాగానే కదులుతున్నాడు కానీ.. వికెట్ల మధ్య పరిగెత్తడం కష్టం. అందుకే తానేం ఇవ్వగలడో అతడే అంచనా వేసుకుంటాడు. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ముందు బ్యాటింగ్‌కు దిగుతాడు. సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటే ఇతరులకు అవకాశం ఇస్తాడు. కానీ అతను మాకు చాలా విలువైన ప్లేయర్. వికెట్‌ కీపింగ్, నాయకత్వం మాకు చాలా అవసరం' అన్నాడు. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఇక సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువాహటిలో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయిన ఆర్ఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ టీమ్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి సీఎస్కేకు 184 లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటర్లకు మొదటి ఓవర్లోనే ఝలక్ తగిలింది. మూడో బంతికే సీఎస్కే తన మొదటి వికెట్ ను కోల్పోయింది. తరువాత కూడా చాలా తొందరగానే మరో రెండు వికెట్లు పడిపోయాయి. రచిన్ రవీంద్ర 0, రాహుల్ త్రిపాఠీ 23, శివమ్ దూబే 18, విజయ్ శంకర్ 9లు వరుసగా అవుట్ అయిపోయారు. కానీ చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాత్రం పట్టుదలగా ఆడాడు. 63పరుగులు చేసి టీమ్ గెలిపించడానికి కష్టపడ్డాడు. 19వ ఓవర్లో కూడా చెన్నై మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించాయి. కానీ 19 ఓవర్లో సందీప్ బౌలింగ్ లో ధోని అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఆర్ఆర్ సొంతమైంది.

dhoni | batting | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు