CSK Vs MI: కష్టం మీద గట్టెక్కిన చెన్నై.. ముంబయిపై విజయం

ఐపీఎల్ లో 2025 ఈరోజు ముంబయి, చెన్నైల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది.  6 వికెట్లు నష్టపోయి చెన్నై మ్యాచ్ గెలిచింది.

New Update
ipl

Chennai Super Kings

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రోహిత్‌ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ రికెల్టన్‌ (13), అశ్విన్‌ బౌలింగ్‌లో విల్ జాక్స్‌ (11) త్వరత్వరగానే ఔట్‌ అయ్యారు.

వెంటవెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (29), తిలక్‌ వర్మ (31)  ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ ను 7 ఓవర్లలో స్కోర్‌ 60 దాటించారు.  అయితే నూర్‌అహ్మద్‌ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ..  ధోనీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తరువాత రాబిన్‌ మింజ్‌ (3), తిలక్‌ వర్మ, నమన్‌ ధిర్‌ (17), మిచెల్ శాంట్నర్ (11) తక్కువ  పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపక్ చాహర్ (28) మెరుపులు మెరిపించడంతో. ముంబై జట్టు155 పరుగులు అయిన చేయగలిగింది.  చెన్నై బౌలర్లలో నూర్‌అహ్మద్‌ నాలుగు, ఖలీల్‌ అహ్మద్‌ మూడు, అశ్విన్‌, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీశారు.  

కష్టం మీద గెలిచిన చెన్నై..

రెండో ఇన్నింగ్స్ లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కూడా వెంట వెంటనే వికెట్లను పొగొట్టుకుంది. తిలక్ వర్మ, శివమ్ దూబే సింగిల్ డిజిట్లకే పెవిలియన్ బాట పట్టారు. అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం దూకుడుగా ఆడుతూ జట్టును ముందు నడిపించాడు.  కేవలం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది..జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 53 పరుగుల దగ్గర రుతురాజ్ అవుట్ అయ్యాడు. ఇతని తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ లో అర్ధశతకాన్ని కొట్టాడు. 42 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

అయితే మరోవైపు బ్యాటర్లు వరుసగా వికెట్లు పోగొట్టుకోవడంతో ఆట నెమ్మదించింది. చివరకు వచ్చేసరికి చెన్నై బ్యాటర్లు ఆచి తూచి ఆడడం మొదలుపెట్టారు. దీని వలన మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. చివర్లో తొమ్మది బంతుల్లో నాలుగు రన్స్ సాధించాల్సిన సమయంలో కూడా జడేజా వికెట్ ను కోల్పోయింది చెన్నై. దీంతో మ్యాచ్ ను గెలిపించడానికి ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివర్లో రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టడంతో సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 

 today-latest-news-in-telugu | ipl-2025 | CSK vs MI 

Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు