/rtv/media/media_files/2025/07/23/rishab-panth-2025-07-23-22-23-13.jpg)
Rishab Panth
మాంచెస్టర్‌లో ప్రారంభమైన నాల్గవ భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్‌లో మొదటి రోజు రిషబ్ పంత్ గాయపడి రిటైర్ అయ్యాడు. భారతదేశం చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌ను రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా బంతి బూట్‌కు తగిలినప్పుడు ఈ గాయం అయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అయితే అది నాటౌట్గా వచ్చింది. కానీ తరువాత పంత్ నొప్పితో ఆడలేక ఆట నుంచి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. కుడిపాదానికి బంతి తగలడంతో అక్కడ బాగా వాచిపోయిందని చెబుతున్నారు. బాగా రక్తస్రావం కూడా అవడంతో అతను నిలబడలేని పరిస్థితి కూడా వచ్చింది. దీంతో పంత్ ను గ్రౌండ్ నుంచి స్ట్రెచర్ మీద తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత ఆంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Rishabh Pant is driven off the field of play after suffering some severe swelling on his right foot and Ravindra Jadeja walks out to the middle... 🩹 pic.twitter.com/vJlu5CABQ8
— Sky Sports Cricket (@SkyCricket) July 23, 2025
హైయ్యెస్ట్ స్కోరర్..
వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ టెస్ట్ సీరీస్ లలో బాగా రాణిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 70.83 సగటుతో 425 పరుగులు చేసి, రెండు సెంచరీలు మరియు రెండు అర్ధ సెంచరీలతో రెండవ అత్యధిక స్కోరర్ గా ఉన్నాడు. మూడు టెస్ట్ లలో అతని హైయ్యెస్ట్ స్కోరు 134. ఇతనికి ఈ సీరీస్ లో పలు రికార్డ్ లు కూడా ఉన్నాయి.