/rtv/media/media_files/2025/09/14/bcci-2025-09-14-15-43-36.jpg)
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు హాజరు కావడం లేదు. బీసీసీఐ సెక్రటరీ సైకియా, ఐపీఎల్ ఛైర్మెన్ ధుమాల్ తదితరులు దుబాయ్ కు వెళ్లి మ్యాచ్ చూసేందుకు విముఖత చూపించినట్లుగా సమాచారం. ఐసీసీ ఛైర్మెన్ జైషా ప్రస్తుతం యూఎస్ లో ఉన్నారు.ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారని కెమెరా ముందుకు వీరంతా రావడం లేదని తెలుస్తోంది.
ఆసియాకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్‌ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు.
ఇప్పటి వరకు 16 సార్లు పోటీ
ఇక భారత్ తమ మొదటి మ్యాచ్‌లో యూఏఈని 9 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి, యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌లో ఒమన్‌పై 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వారి బ్యాటింగ్ , బౌలింగ్ రెండూ బలమైన ప్రదర్శన చేశాయి. భారత్ , పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 16 సార్లు తలపడ్డాయి. ఈ రికార్డులలో భారత్ 9 సార్లు గెలవగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే, ప్రస్తుత ఫామ్, జట్ల బలం ఆధారంగా చూస్తే, ఇది ఇరు జట్ల మధ్య ఒక హోరాహోరీ పోరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ టాప్ పొజిషన్‌ను నిర్ణయించడంలో కీలకం కానుంది.
Also Read : Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరిన సీఎం మనవడు ! ఎందుకో తెలుసా