Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరిన సీఎం మనవడు ! ఎందుకో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా  దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.  అతి చిన్న వయసులోనే క్లిష్టమైన 175 చెస్ పజిల్స్‌ను  పరిష్కరించి  “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్” అవార్డ్ అందుకున్నాడు.

New Update
Nara Devansh

Nara Devansh

Nara Devansh:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మనవడు, ,ఐటీ మినిష్టర్  నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. చెస్ ఆటలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను చాలా తక్కువ సమయంలో పరిష్కరించి "ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్" గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-2025 అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డుల ప్రదానోత్సవం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరగగా.. ఈ కార్యక్రమానికి  మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు.

దేవాన్ష్ రికార్డు వివరాలు

దేవాన్ష్ ఈ రికార్డును గతేడాది జరిగిన చెక్ మేట్ మారథాన్‌లో సాధించాడు. ఈ మారథాన్‌లో లాస్లో పోల్గార్ రాసిన '5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్' పుస్తకం నుంచి  తీసుకున్న 175 క్లిష్టమైన పజిల్స్‌ను దేవాన్ష్ పరిష్కరించాడు.  వేగం, ఖచ్చితత్వం, ఆలోచనా నైపుణ్యాలను ఈ పజిల్ పరీక్షిస్తుంది.  అత్యంత తక్కువ సమయంలో దేవాన్ష్ ఈ పజిల్ ని పరిష్కరించడం ద్వారా  "ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్'' అవార్డును గెలుచుకున్నాడు. 

తండ్రి నారా లోకేష్ హర్షం

ఈ సందర్భంగా దేవాన్ష్ తండ్రి  మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..  "వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో దేవాన్ష్ ఈ గౌరవం అందుకోవడం ఎంతో ప్రత్యేకమైనది అని అన్నారు.  చిన్న వయసులోనే దేవాన్ష్‌కున్న అంకితభావం, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో తీసుకునే  సరైన నిర్ణయాలు ఈ విజయానికి కారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా అతడి కష్టాన్ని దగ్గర నుంచి చూశాను! అతడి కృషి, కష్టానికి ఈ గుర్తింపు నిజమైన బహుమతి అని కొనియాడారు. దేవాన్ష్ సాధించిన ఈ ఘనతకు మేమంతా ఎంతో గర్విస్తున్నాము అని పేర్కొన్నారు. 

ఇతర ప్రపంచ రికార్డులు

ఇది మాత్రమే కాదు గతంలోనూ దేవాన్ష్  రెండు ప్రపంచ రికార్డులను సాధించాడు.  7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. ఆ తర్వాత  9 చెస్ బోర్డులపై 32 పావులను సరైన పద్ధతిలో కేవలం 5 నిమిషాల్లో అమర్చడం ద్వారా మరో ఘనత సాధించాడు. దేవాన్ష్ సాధించిన ఈ విజయాలు చెస్ రంగంలో అతడి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాయి. 

Also Read: Mirai Day BOX Office Collections: 'మిరాయ్' 'కలెక్షన్ల సునామీ.. రెండు రోజుల్లోనే బ్రేక్-ఈవెన్! ఎన్ని కోట్లంటే

Advertisment
తాజా కథనాలు