ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఆ పని చేయాల్సిందే.. షమీకి బీసీసీఐ కండీషన్స్!

ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న మహ్మద్ షమీకి బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. బరువు తగ్గడంతోపాటు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని రెండు కండీషన్స్ పెట్టింది. ఈ రెండు డిసెంబర్ 14 లోపు జరిగిపోవాలని డెడ్ లైన్ విధించింది.

author-image
By srinivas
New Update
rerererr

Shami : ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆడాలని ఉవ్విలూరుతున్న భారత పేసర్ మహ్మద్ షమీకి బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న షమీ.. రెండో టెస్టు నాటికి ఆసీస్‌లో అడుగుపెట్టబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిపై తాజాగా స్పందించిన బీసీసీఐ ఇప్పుడే షమీని ఆసీస్ పంపించట్లేదని తెలిపింది. కానీ షమీ వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే.. తాము పెట్టిన రెండు కండీషన్లను పూర్తి చేస్తేనే పంపింస్తామని, ఇందుకు డెడ్‌లైన్‌ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం కాపాడాలంటూ..

ఈ మేరకు ‘షమీని వైద్య బృందం పరిశీలిస్తోంది. అతను బౌలింగ్‌ తీరును గమనిస్తోంది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ మ్యాచుల్లో షమీ బౌలింగ్‌పై ఫోకస్ చేశాం. మెడికల్ టీమ్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే షమీ ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ ఉంది. టీ20ల్లో 4 ఓవర్ల ఆధారంగా అతడి ఫిట్‌నెస్‌పై నిర్ణయం తీసుకోలేం' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక షమీని జట్టులోకి డైరెక్ట్ గా తీసుకోవాలంటే రెండు టెస్టులు పాస్‌ కావాలి. డిసెంబర్ రెండో వారంలోపే పూర్తి చేయాలి. డిసెంబర్ 14 వరకు బరువు తగ్గాలి. పూర్తి ఫిట్‌నెస్ సాధించాలి. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ దగ్గరలో ఉన్నందున అతనిపై ఒత్తిడి పడకుండా చూడాలని భావిస్తున్నామని తెలిపారు. ఇక రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ మెరుగైన ప్రదర్శన చేశాడు. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

Also Read: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు