Shreyas Iyer: BCCI సర్‌ప్రైజ్.. టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

2025 ఆసియా కప్‌కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్‌లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

New Update
bcci announced team india a squad captain shreyas iyer against australia

bcci announced team india a squad captain shreyas iyer against australia

2025 ఆసియా కప్‌కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. టీమిండియాకు కొత్త కెప్టెన్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సారి శ్రేయాస్ అయ్యర్ ఇండియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సారి బరిలోకి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే దిగనుంది. కాగా ఈ ఆసియా కప్‌కు టీమిండియా జట్టు నుంచి సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్)తో పాటు జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్) వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. అవి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, ఒమన్ ఉన్నాయి. ఈ టోర్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 

bcci announced team india a squad 

అయితే ఈ జట్టులో స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ పేరు లేకపోవడంతో క్రికెట్ ప్రియులు, అభిమానులు చాలా నిరాశ చెందారు. అంతేకాకుండా బీసీసీఐపై రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో బీసీసీఐ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. సెప్టెంబర్ 16 నుంచి ఇండియా ఎ జట్టు ఆస్ట్రేలియా ఎ జట్టుతో 2 మల్టీ-డే మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్‌లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. 

ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్‌.. ఇప్పుడు ఇండియా ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో బీసీసీఐ జట్టు పేర్లను వెల్లడించింది. 

ఇండియా ఎ జట్టు 

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, గుర్న్‌మేధర్ కృష్ణ, ప్రసీద్ సుతార్, యష్ ఠాకురాన్. కాగా ఈ తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ లకు చోటు దక్కలేదు. కానీ రెండో మల్టీ-డే టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లను భారత జట్టులోకి తీసుకుంటారని సమాచారం. 

ఇదిలా ఉంటే రెండు మల్టీ-డే టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 16 నుండి 19 వరకు జరుగుతుంది. రెండవ మల్టీ-డే టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 23 నుండి 26 వరకు జరుగుతుంది. రెండు మ్యాచ్‌లు లక్నోలో జరుగుతాయి. అలాగే ఈ మల్టీ-డే మ్యాచ్‌ల తర్వాత 3 వన్డేలు జరుగుతాయి. ఇవి వరుసగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 తేదీలలో జరుగుతాయి. 

Advertisment
తాజా కథనాలు