/rtv/media/media_files/2025/12/20/t20-world-cup-2025-12-20-14-58-39.jpg)
అనుకోని మార్పులు, అనూహ్య చేర్పులతో టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కానీ శుభ్ మన్ గిల్ మాత్రం జట్టులో వైస్ కెప్టెన్సీతో పాటూ చోటును కూడా కోల్పోయాడు. అలాగే యశస్వి జైస్వాల్ ను కూడా ఎంపిక చేయలేదు. కానీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్కిషాన్ మాత్రం అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రీసెంట్ గా అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ రాణించడం వల్లనే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక టీ20 వరల్డ్ కప్ కంటే ముందు భారత జట్టు న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జనవరి 11 నుంచి ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో కూడా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టే ఆడనుంది.
ఫిబ్రవరి 7 నుంచి..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. మార్చి 8ను ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ గ్రూప్ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది.
భారత జట్టు...
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Follow Us