BIG BREAKING: టీమిండియాకు గట్టిపోటీ.. ఆస్ట్రేలియా వన్డే, T20 సిరీస్ ఫైనల్ జట్లు అనౌన్స్

భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, మిచెల్ మార్ష్ రెండు ఫార్మాట్‌లలోనూ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

New Update
AUS ODI SQUAD (1)

AUS ODI SQUAD

ఆస్ట్రేలియా Vs భారత్ మధ్య అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆసీస్ సెలెక్టర్లు ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అదే సమయంలో వన్డే జట్టుతో పాటు టీ20 టీంను కూడా అనౌన్స్ చేశారు. ఇందులో ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కలేదు. దీంతో అతడి కెప్టెన్సీ బాధ్యతను ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు అప్పగించారు. మార్ష్ రెండు ఫార్మాట్‌లలోనూ (ODI, T20) జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

AUSTRALIA ODI SQUAD

ఆస్ట్రేలియా ODI జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మ్యాథ్యూ రెన్షా, మ్యాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

AUSTRALIA T20 SQUAD

ఆస్ట్రేలియా T20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబాట్, గ్జావియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మ్యాథ్యూ కుహనెమన్, మిచెల్ ఓవెన్, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

వన్డే జట్టు ప్లేయర్ల వివరాలు

అక్టోబరు 19 నుంచి వన్డే సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా బడా ప్లేయర్లతో స్క్వాడ్‌లను సెలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ వన్డే జట్టులో ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. లబుషేన్ స్థానంలో క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మెన్ మ్యాథ్యూ రెన్షాకు వన్డే జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలెక్స్ క్యారీతో పాటు జోష్ ఇంగ్లిస్ను ఎంపిక చేశారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ వంటి బడా ప్లేయర్స్ ఉన్నారు. వీరితోపాటు యువ పేసర్లు గ్జావియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్లకు అవకాశం లభించింది. 

టీ 20 జట్టు ప్లేయర్ల వివరాలు

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్టును ప్రకటించింది. ఇందులో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు గాయం కారణంగా విశ్రాంతి ఇచ్చారు. టీ20లలో మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసక బ్యాటర్స్ కీలకం కానున్నారు. స్పిన్ బాధ్యతలను ఆడమ్ జంపా, మ్యాథ్యూ కుహనెమన్ తీసుకోనున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్, షాన్ అబాట్ ఉన్నారు. తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే స్క్వాడ్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు