భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 157 పరుగుల లీడ్ సంపాదించింది. ALSO READ: పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం! ఆస్ట్రేలియా ఆలౌట్ 86/1తో ఆస్ట్రేలియా రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ చెలరేగి ఆడాడు. రెండు మూడు అవకాశాలు రావడంతో భారీ స్కోర్ చేశాడు. సుమారు 140 పరుగులు చేశాడు. ఇలా 87.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. ALSO READ: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు దీంతో ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం లభించింది. ఇదిలా ఉంటే ఓవర్ నైట్ 86/1 స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 15 పరుగుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్ బూమ్రా తన జెట్ స్పీడ్ బౌలింగ్‌తో ఓపెనర్ మెక్ స్వీని (39), స్టీవ్ స్మిత్ (2)లను ఔట్ చేశాడు. ALSO READ: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు! ఆ తర్వాత దిగిన లబుషేన్, ట్రావిస్ హెడ్‌లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం లబుషేన్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే మరికొద్ది సేపటికే మార్ష్ (9) కూడా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 208 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇలా వికెట్లు పడినా.. మరోవైపు ట్రావిస్ హెడ్ తన దూకుడు ఆపలేదు. అలెక్స్, ప్యాట్ కమిన్స్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే సమయంలో సెంచరీ పూర్తి చేసి వావ్ అనిపించుకున్నాడు. అనంతరం మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ALSO READ: అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం! ఇక టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, బుమ్రా నాలుగేసి వికెట్ల చొప్పున తీశారు. ఇక నితీశ్ రెడ్డి, అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు టీమిండియా 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.