/rtv/media/media_files/2025/09/10/india-vs-pakistan-asia-cup-2025-2025-09-10-08-01-28.jpg)
india vs pakistan asia cup 2025
ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లలో ముఖ్యంగా భారత్ VS పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న అంటే మంగళవారం అఫ్గానిస్తాన్ VS హాంకాంగ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.
ఇవాళ భారత్ VS యూఏఈ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. భారత్ VS పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
india vs pakistan asia cup 2025 match
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ మ్యాచ్‌ను నిషేధించాలని.. దానిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పూణేకు చెందిన కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాని ప్రకారం.. మే నెలలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం vs పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించరాదని పేర్కొన్నారు.
ASIA CUP 2025
— DTH Tricks World 🐐 (@dthtricksworld) September 9, 2025
14th September 2025
INDIA vs PAKISTAN LIVE on SONY WAH, DD SPORTS, DD SPORTS HD#AsiaCup2025#TeamIndia#INDvPAK#INDvsPAK#SuryakumarYadav#ShubmanGill#T20Cricketpic.twitter.com/fhBYiNxW99
భారత పౌరులకు గౌరవంతో జీవించే సానుకూల హక్కు ఉందని.. దీంతోపాటు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఈ మ్యాచ్ ఉల్లంఘించిందని తిరోద్కర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల జాతీయ క్రీడా పాలన చట్టం 2025ను అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)ని జాతీయ క్రీడా సమాఖ్య (NSF) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఒక ఉత్తర్వు లేదా ఏదైనా ఇతర తగిన రిట్ జారీ చేయాలని పిటిషన్ కోరారు.
అక్కడితో ఆగకుండా జాతీయ క్రీడా పాలన చట్టం 2025 ప్రకారం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా బోర్డు (NSB) నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలను నమోదు చేసుకుని, వాటిని తప్పకుండా పాటించాలని BCCIని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో వెల్లడించారు. అంతేకాకుండా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ‘‘మా దళాలకు, పౌరులకు ‘మేము మిమ్మల్ని పట్టించుకోము’ అనే దేశ వ్యతిరేక సందేశాన్ని ఇస్తున్నట్లు’’ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 12) విచారించనుంది.
Follow Us