Ashwin : రిటైర్మెంట్‌ ప్రకటనపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

రిటైర్మెంట్ పై అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు ఇంకా క్రికెట్ ఆడే బలం ఉందన్నాడు. కానీ తానే  బ్రేక్‌ కావాలని నిర్ణయించుకున్నాని.. అందుకే, సిరీస్‌ మధ్యలోనే వచ్చేశానని తెలిపాడు. వ్యక్తిగతంగా తానేలాంటి ఫేర్‌వెల్ మ్యాచ్‌లకు ప్రాముఖ్యత ఇవ్వనని తెలిపాడు.

New Update
Ashwin

Ashwin Photograph: (Ashwin )

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండానే అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.తాజాగా తన యూట్యూబ్  ఛానల్  వేదికగా అశ్విన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు మ్యాచుల్లో ఒకటి మాత్రమే ఆడటంతో తనలో క్రియేటివిటీ తగ్గినట్లు అనిపించిందని తెలిపాడు. అందుకే  రిటైర్మెంట్ ప్రకటన  చేశానన్నాడు.  ఇంకా ఆడాలని తనుకు ఉన్న జట్టులో చోటు ఎక్కడుంది. ఎందుకు రిటైర్ కావడం లేదని జనాలతో అనిపించుకోవడం కన్నా..  ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించావ్ అని అనిపించుకోవం బెటర్ అని తెలిపాడు. ఫేర్‌వెల్ మ్యాచ్‌ కోసం తాను జట్టులో ఉండటం తనకు ఇష్టం లేదన్నాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటించానని తెలిపాడు.  

తాను ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించలేదన్న అశ్విన్.. తనకు ఇంకా క్రికెట్ ఆడే బలం ఉందన్నాడు.  కానీ తానే  బ్రేక్‌ కావాలని నిర్ణయించుకున్నాని..  సిరీస్‌ మధ్యలోనే వచ్చేశానని తెలిపాడు. ఇక అశ్విన్‌కు అవమానం జరగడంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడంటూ వస్తోన్న వార్తలను సైతం అశ్విన్ కొట్టిపారేశాడు. అందులో ఎలాంటి నిజం లేదన్నాడు.  

అశ్విన్ 2024 డిసెంబర్ 18న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నాడు. గాబా టెస్టు ఐదో రోజు చాలా భావోద్వేగంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్‌కు ముందు విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న అశ్విన్ ..   హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడాడు, ఆపై రోహిత్‌తో కలిసి విలేకరుల సమావేశానికి వచ్చి తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లుగా వెల్లడించాడు.  

రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్

భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం అశ్విన్ 765 వికెట్లు తీశాడు. అశ్విన్  కంటే ముందు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (953) ఉన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియాలో రవీంద్ర జడేజా (597), జస్‌ప్రీత్ బుమ్రా (443) మాత్రమే ఈ రేసులో ఉన్నారు. 

 Also Read :  గేమ్ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు