గేమ్ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్

గేమ్ఛేంజర్  ఔట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు  శంకర్. ముందుగా ఈ సినిమా నిడివి 5 గంటలు ఉందని..  అయితే సమయాభవం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించారు.  ఇక సినిమాకు వచ్చిన రివ్యూలను తాను చూడలేదన్నారు.  

New Update
Shankar game changer

Shankar game changer Photograph: (Shankar game changer )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2  ప్లాప్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. అంచనాలకు తగ్గట్టుగానే గేమ్ఛేంజర్ మూవీకి మిక్సుడ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా సో సోగానే వచ్చాయి. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది.

మంచి సీన్స్ కట్ చేశాం

అయితే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావడంపై డైరెక్టర్ శంకర్ స్పందించారు.  గేమ్ఛేంజర్  ఔట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు  శంకర్.  ముందుగా ఈ సినిమా నిడివి 5 గంటలు ఉందని..  అయితే సమయాభవం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించారు.  దీంతో కథ తాను అనుకున్న విధంగా రాలేదని వెల్లడించారు. ఇక సినిమాకు వచ్చిన రివ్యూలను తాను చూడలేదన్నారు శంకర్.  సినిమా చేసి 3 ఏళ్లు అయిందని అందరూ అంటున్నారు కానీ..  సంవత్సరం న్నర మాత్రమే తీశామని..  వేరే కారణాల వల్ల సినిమా ఆలస్యం అయిందని వెల్లడించారు.  దీని వల్ల బడ్జెట్ కూడా పెరిగిందని తెలిపారు శంకర్.  ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్యల నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు.  

శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 తర్వాత గేమ్ ఛేంజర్ మూవీకి కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇందులో రామ్ రామ్ నందన్ అనే IAS అధికారిగా అప్పన్న అనే పాత్రలో నటించాడు. కియారా  దీపికగా నటించగా, అంజలి  పార్వతి అనే పాత్రలో కనిపించింది.  సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు.  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు.  

Also Read :  వెంకీనా మజాకా..  అదరగొట్టిన  సంక్రాంతికి వస్తున్నాం  ఫస్ట్ డే కలెక్షన్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు