/rtv/media/media_files/2025/07/17/breaking-2025-07-17-10-36-39.jpg)
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలిని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రస్సెల్, తన స్వదేశం జమైకాలోని సబీనా పార్క్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు. సెయింట్ కిట్స్ & నెవిస్‌లో జరిగే చివరి మూడు T20Iలకు రస్సెల్ స్థానంలో మాథ్యూ ఫోర్డ్ ఎంపిక చేశారు సెలక్టర్లు.
Thank You, DRE RUSS!🫶🏽
— Windies Cricket (@windiescricket) July 16, 2025
For 15 years, you played with heart, passion, and pride for the West Indies 🌴
From being a two-time T20 World Cup Champion to your dazzling power on and off the field.❤️
WI Salute You!🏏#OneLastDance#WIvAUS#FullAhEnergypic.twitter.com/bEWfdMGdZ7
ప్రస్తుతం 37 ఏళ్ల రస్సెల్ వెస్టిండీస్ తరఫున 84 టీ20 మ్యాచ్‌లు ఆడి 1078 పరుగులు చేసి 61 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లలో విజేత జట్టులో కూడా అతను సభ్యుడిగా ఉన్నాడు. గ్లోబల్ ఫ్రాంచైజ్ సర్క్యూట్‌లో 561 టీ20 మ్యాచ్‌లతో అతను 168.31 స్ట్రైక్ రేట్‌తో 9316 పరుగులు సాధించాడు. 485 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇటీవల రస్సెల్ USAలో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ (LAKR) తరపున మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆడాడు, తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 25.20 సగటుతో 126 పరుగులు చేశాడు, ఇందులో అర్ధ సెంచరీ ఉంది. 32.90 సగటుతో 10 వికెట్లు కూడా పడగొట్టాడు. రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒకే ఒక టెస్ట్ ఆడాడు, 56 వన్డేలు ఆడాడు, 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు, 130 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు వన్డేల్లో 92*, అతను 31.84 సగటుతో 70 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం వెస్టిండీస్ టీ20 జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్
ఈ సిరీస్ జూలై 20 నుండి జూలై 28 వరకు జరుగుతుంది. మొదటి మూడు ఆటలు జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగుతాయి, చివరి రెండు ఆటలు సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో జరుగుతాయి.