Rahane: రోహిత్ రిటైర్మెంట్‌పై రహానే షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ!

రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్ పై అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ వీడ్కోలు వార్త వినగానే ఒక్కసారిగా కంగుతిన్నానని చెప్పాడు. ఏది ఏమైనా ఏ ఫార్మట్‌లోనైనా స్వేచ్ఛగా బ్యాంటింగ్ చేయాలని కోరుకునే రోహిత్‌కు ఆల్‌ ది బెస్ట్ అని చెప్పాడు.

New Update
rahane rohit

Ajinkya Rahane shocking comments on Rohit Sharma retirement

Rahane: రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్ పై అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ వీడ్కోలు వార్త వినగానే ఒక్కసారిగా కంగుతిన్నానని చెప్పాడు. ఏది ఏమైనా ఏ ఫార్మట్‌లోనైనా స్వేచ్ఛగా బ్యాంటింగ్ చేయాలని కోరుకునే  రోహిత్‌కు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నా అన్నాడు. 

అతని ఆటతీరు అద్భుతం..

ఈ మేరకు చెన్నైతో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేకేఆర్ కెప్టెన్.. ‘రోహిత్ విషయం తెలియగానే షాక్ అయ్యాను. మ్యాచ్‌ ముగిసేవరకు నాకు తెలీదు. రోహిత్‌కు ఆల్‌ ది బెస్ట్. మేము ఇద్దరం చాలా రోజులు కలిసి ఆడాం.  మిడిలార్డర్‌ బ్యాటర్ ఇన్నింగ్స్‌ ప్రారంభించే స్థితికి చేరుకున్నాడు. అతని అంచనాలు అద్భుతంగా ఉంటాయి. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తాడు. ఇతరులు కూడా అలాగే చేయాలని కోరుకుంటాడు' అంటూ రహానే అతనితో రిలేషన్ పై చెప్పుకొచ్చాడు. 

ఇక దేశవాళీలో ముంబై టీమ్ కు అజింక్య రహానె కెప్టెన్ వ్యహరిస్తున్నాడు. రహానే నాయకత్వంలోనే రోహిత్ ఇటీవల  రంజీ ట్రోఫీ మ్యాచ్‌ లు ఆడాడు. రోహిత్ శర్మ టెస్టులనుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టిన రోహిత్.. 67 టెస్టులాడి 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలుండగా 212 అత్యధిక స్కోర్ చేశాడు. 

ajinkya-rahane | rohit-sharma | retirement | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు