Mega Star: చిరంజీవికి లైఫ్ ఎచీవ్ మెంట్..యూకే పార్లమెంట్లో ఘన సత్కారం

మెగస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్ లో ఘన సత్కారం జరిగింది. దాంతో పాటూ ఆయనకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

New Update
cinema

Mega Star Chiranjeevi

 

యూకే పార్లమెంట్ మెగాస్టార్ చిరంజీవిని ఘనగా సత్కరించింది. దాదాపు యూభై ఏళ్ళుగా ఆయన సినీ రంగానికి అందించిన సేవలకు గానూ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారంతో గౌరవించింది. యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

గతేడాది అవార్డుల వర్షం..

గత ఏడాదిగా మెగాస్టార్ చిరుకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినందుకు గనూ లాస్ట్ ఇయర్ గిన్నిస్ రికార్డ్, అక్కినేని నాగేశ్వర్రావు అవార్డు వచ్చింది. ఈ రెండింటితో పాటూ అవుట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డను ఇచ్చి ఐఫా గౌరవించింది.  వీటన్నిటితో పాటూ భారతదేశ అ్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ ను కూడా చిరు అందుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే చిరు విశ్వంభర అనే సినిమాను చేస్తున్నారు. దీంతో పాటూ ఈమధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టారు. 

Also Read: AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు