/rtv/media/media_files/2025/06/14/5Qw1eHlhKuGr4bxpZZIs.jpg)
South Africa Won in WTC finals
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను దక్షిణఫ్రికా సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంపర్ విక్టరీ సాధించింది. ఐదెన్ మార్‌క్రమ్ (136) సెంచరీతో చెలరేగిపోయాడు. 213/2 స్కోరుతో సఫారీ టీమ్ నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఇందులో మరో మూడు వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలింది.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ టీమ్ 207 పరుగులు చేసింది. ఇక 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా పుంజుకుంది. బవుమా ఔటైనప్పటికీ కూడా మార్‌క్రమ్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు గెలుపును అందించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్‌కు ముందే సౌతాఫ్రికా మ్యాచ్ గెలిచింది. ఎట్టకేలకు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. మార్‌క్రమ్ ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 1998లో చివరిసారిగా సౌతాఫ్రికా ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ 27 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
The moment all of South Africa had been waiting for 🇿🇦🏆#WTC25 #SAvAUS pic.twitter.com/tmgZGbkFFy
— ICC (@ICC) June 14, 2025
This time for Africa! 🇿🇦 🏆#WtcFinal2025 #SouthAfrica pic.twitter.com/AkjxtviA6K
— Deepu (@deepu_drops) June 14, 2025
ICC World Test Champions 2025!#WtcFinal2025 #Proteas pic.twitter.com/LJnsfdHnhu
— Captain Springbok (@CaptSpringbok) June 14, 2025
Also Read: భీకర యుద్ధం.. ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!