ఏపీలో ఓ నాగుపామును స్నేక్ క్యాచర్ కాపాడిన్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చింతావానిరేవు వద్ద వలలో నాగుపాము చిక్కుకున్నది. రాత్రి నుంచి వలలో చిక్కుకుని విలవిలలాడుతుండగా, ఆ నాగుపామును వలలో నుంచి విడిపించిన స్నేక్ కాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడకు చేరుకున్న వర్మ పామును వల నుంచి క్షేమంగా బయటకు తీశాడు. ఈరోజు పవిత్రమైన నాగులచవితి కావడంతో ఆ నాగుపాముకు పాలుపోసి, పసుపు కుంకుమ చేసి పూజలు చేశారు గ్రామ ప్రజలు. పండగ రోజు పాటు ఇంటికి రావటం.. పూజలు చేయడం సంతోషంగా ఉందని మహిళలు చెబుతున్నారు. అనంతరం పామును సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టేందుకు వర్మ తనవెంట తీసుకువెళ్లాడు.
పూర్తిగా చదవండి..Cobra: వలలో చిక్కుకున్న నాగుపాము.. ఎలా కాపాడారంటే..!!
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధిన నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. అయితే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం భారతదేశంలో హింధూవులు అనాదిగా వస్తున్న ఆచారం. కాగా..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నాగుపాము కలకలం రేపింది.
Translate this News: