India vs New Zealand Semi Final: ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపు మొదటి సెమీస్ మ్యాచ్ జరగబోతోంది. భారత్-న్యూజిలాండ్ ఇందులో తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు తొమ్మిది గెలిచిన భారత్.. అదే జోరును కివీస్‌పై కొనసాగించి గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ భావిస్తోంది. దీనిబట్టి రేపు ఇరు టీమ్ ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్..
వరుస విజయాలతో టీమ్ ఇండియా చెలరేగిపోతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్ లు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఇదే ఊపును రేపటి మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని అనుకుంటోంది మేనేజ్మెంట్. దాంతో పాటూ రోహిత్ తన జోరును కొనసాగిస్తే మనకి తిరుగే ఉండదు. ఇక తరువాత వచ్చే విరా్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్ రాహుల్ లు కూడా తమ ఫామ్ లు కొనసాగిస్తే పరుగుల వరద రావడం ఖాయం. దేవుడి దయవల్ల టాప్ ఆర్డర్ అంతా చాలా బలంగా ఉంది ఇప్పటివరకూ. అందరూ సూపర్ గా ఆడుతున్నారు. ఇందులో ఏ ఇద్దరు బాగా ఆడినా కూడా కీవీస్ కు కష్టాలు తప్పవు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే రెగ్యులర్ బౌలర్లు అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈసారి సెమీస్ లో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌ను (Ravichandran Ashwin) దించాలని అనుకుంటోంది మేనేజ్మెంట్. కీవీస్ బ్యాటర్లు చాలా మంది లెఫ్ట్ హ్యాండర్లు. దానికి తోడు వాంఖడే స్టేడియం (wankhede stadium) పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అందుకే అశ్విన్ అయితే బౌలింగ్ పకడ్బందీగా ఉంటుంది. అయితే అశ్విన్ వస్తే మిడిల్ ఆర్డర్ బలహీనం అయిపోతుంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. భారత్ పేస్, స్పిన్ విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. షమీ, కుల్దీప్, జడేజాలు ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ పడగొట్టి ప్రత్యర్థులను హడలెత్తించారు. బుమ్రా, సిరాజ్ ఆరంభంలోనే వికెట్స్ తీస్తూ మంచి ఆరంభం అందిస్తున్నారు. అందరూ చెలరేగితే కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడం కష్టమేమీ కాదు.
భారత తుది జట్టు(అంచనా) - Team India Predicted 11
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.