Telangana : బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కందాల ఉపేందర్ రెడ్డి !

బీఆర్ఎస్‌ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

New Update
Telangana : బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కందాల ఉపేందర్ రెడ్డి !

BRS :బీఆర్ఎస్‌ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి(Kandala Upender Reddy).. మళ్లీ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్(Congress) పార్టీలో చేరుతారంటూ ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా.. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు కందాల దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన.. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు.

Also Read: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

అలాగే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో కూడా కందాల ఉపేందర్‌ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) చేతిలో ఓడిపోయారు . అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కందాల మౌనం వహించడంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరాలంటూ కటుంబ సభ్యులు కూడా ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ.. ఇటీవల కందాలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ నేతలు చెపట్టిన రైతు దీక్షలు, పాజెక్టుల పరిశీలన, కేసీఆర్‌ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కందాల కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేక బీఆర్‌ఎస్‌లోనే ఉంటారా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్

Advertisment
తాజా కథనాలు