Space X : న్యాయం కోసం వెళితే తమకు అన్యాయం ఎదురైంది అంటుననారు ఎనిమిది మంది ఉద్యోగులు. ఎలాన్ మస్క్ (Elon Musk) సెక్సిజం (Sexism), మహిళా ఉద్యోగినుల (Women Employees) పట్ల రేసిజాన్ని ప్రశ్నించినందుకు తమను ఉద్యోగంలో నుంచి తీసేశారని స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ మీద దావా వేశారు ఎనిమిది మంది ఉద్యోగులు. లాస్ ఏంజిలెస్ కోర్టు వీరు ఈ దావాను సమర్పించారు. ఎనిమిది మందిలో నలుగురు మగవారు, నలుగురు ఆడవారు ఉన్నారు. తమను 2022లో ఉద్యోగం నుంచి బయటకు పంపించారని...అది కూడా మస్క్ గురించి సెక్స్ ఆరోపణలు చేస్తూ లెటర్ సర్క్యులేట్ అయ్యాకనే అని వారు చెబుతున్నారు. అంతేకాదు మహిళా ఉద్యోగినుల పట్ల ఎలాన్ మస్క్ చర్యలు విపరీతంగా ఉండేవని ...తమను సెక్స్‌లో పాల్గొనాలని ఆయన వేధించేవారని...అలా కాని పక్షంలో మహిళపట్ల వివక్ష చూపుతూ ప్రవర్తించేవారని మహిళా ఉద్యోగినులు ఆరోపించారు. అయితే ఈ దావాపై స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు స్పందిచలేదు. దీనికి కౌంటర్ పార్ట్‌గా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
మరోవైపు ఎలాన్ మస్క్ గురించి మహిళా ఉద్యోగినులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీటి మీద పలు అంతర్జాతీయ కథనాలు బయటకు వచ్చాయి. స్పేస్ ఎక్స్ ఇంటర్న్ అయిన ఓ మహిళను పిల్లలను కనాలంటూ మస్క్ బలవంతం చేశారని తెలుస్తోంది. పదేపదే ఆమెను వేధించారని ఉద్యోగిని చెప్పింది. మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. దీని కోసం రాత్రిపూట తన ఇంటికి రావాలని మస్క్ కోరినట్లు ఆమె తెలిపింది. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.
Also Read:Odisha: ఇది కదా ఆదర్శం అంటే..మాఝీ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్