Russia: రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా.. ఎందుకంటే

ఉత్తర కొరియా రష్యాకు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు ఇవి వెళ్లినట్లు పేర్కొంది. అలాగే రష్యా తమ ఆయుధ సామగ్రి డిమాండుకు తగ్గట్లుగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని చెప్పింది.

Russia: రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా.. ఎందుకంటే
New Update

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు 20 నెలలు గడిచిపోయాయి. అయినా కూడా ఈ ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే రష్యా.. ఆయుధాల కోసం ఉత్తర కొరియా సహాయం తీసుకుంటోందనే వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. రష్యాకు ఈ ఏడాది ఆగస్టులోనే దాదాపు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించి ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేస్తోంది. అయితే గతంలోనే అమెరికా.. ఉత్తర కొరియా నుంచి రష్యా ఆయుధాలు కొనుగోలు చేయబోతోందని గతంలోనే ఆరోపించింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు 10లక్షల ఫిరంగి గుండ్లు వెళ్లాయని దక్షిణ కొరియా జాతీయ నిఘా విభాగం భావిస్తున్నట్లు స్థానిక చట్టసభ సభ్యుడు యూ సాంగ్‌-బుమ్‌ తెలిపారు.

Also Read: శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడిలో బందీలు మృతి: హమాస్

Also Read: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

అలాగే రష్యా తమ ఆయుధ సామగ్రి డిమాండుకు తగ్గట్లుగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఉత్పత్తిని మరింత పెంచేందుకు జనసమీకరణ కూడా చేస్తోందని ఆరోపించారు. ఆయుధాలను ఎలా వాడాలనే విషయాన్ని రష్యా అధికారులకు చెప్పేందుకు ఆయుధ నిపుణులను కూడా మాస్కోకు పంపించిందనే సంకేతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నిఘా విభాగంతో భేటీ అయిన తర్వాత యూ సాంగ్‌-బుమ్‌ ఈ విషయాలను తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో రష్యా, ఉత్తర కొరియా అధినేతలు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఈ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగానే వార్తలు వచ్చాయి.

Also Read: ఇన్ఫోసిస్‌ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..!

#telugu-news #international-news #america #kim-jong-un #russia #putin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe