Special Trains for Sabarimala: శబరిమల ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో అయ్యప్ప(Ayyappa Swamy)ను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరికి(Sabarimala) వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం మరో 64 ప్రత్యేక రైళ్లు నడపునున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటక విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. దీని ప్రకారం.. శబరిమల వెళ్లేందుకు సికింద్రాబాద్-కొల్లం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 9, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అలాగే నర్సాపూర్-కొట్టాయం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 4 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ఇక తిరుగు ప్రయాణానికి సంబంధించి.. కేరళలోని కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో, జనవరి 9, 16 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా కొట్టాయం నుంచి నర్సాపూర్‌కు డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో, జనవరి 1, 8, 15 తేదీల్లో ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖపట్నం-కొల్లం మధ్య నవంబర్ 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. జనవరి 6, 13, 20, 27 తేదీల్లోనూ శబరిమలకు వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి.
కొల్లం నుంచి విశాఖపట్నానికి నవంబరు 30, డిసెంబరు 7, 1,4, 21, 28 జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి శ్రీకాకుళం రోడ్‌కు నవంబరు 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 1,4, 21, 28 తేదీల్లో ట్రైన్ నడుస్తాయి.
Also Read:
కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..