IND VS SA : టీమిండియాకు గట్టి షాక్‌.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో వరల్డ్‌కప్ హీరో ఔట్!

దక్షిణాఫ్రికతో తొలి టెస్టు డిసెంబర్‌ 26న జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే చీలమండ గాయంతో షమీ బాధపడుతున్నాడు.

New Update
IND VS SA : టీమిండియాకు గట్టి షాక్‌.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో వరల్డ్‌కప్ హీరో ఔట్!

Big Shock To Team India : వరల్డ్‌కప్‌(World Cup) ఫైనల్‌ ఓటమిని ఫ్యాన్స్‌ ఇంకా మరిచిపోలేదు. ఈలోపే ఆస్ట్రేలియా(Australia)తో టీ20 సిరీస్‌ ఆడేశాం. గెలిచేశాం.. తర్వాత దక్షిణాఫ్రికా ఫ్లైట్‌ ఎక్కేశం.. మొదటి టీ20 వర్షార్పణం అయ్యింది. రెండో టీ20 ఓడిపోయాం.. ఇక మూడో టీ20 జరగాల్సి ఉంది. ఆ తర్వాత వన్డేలు స్టార్ట్. డిసెంబర్ 17న తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేల తర్వాత డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. దక్షిణాఫ్రిక గడ్డపై గెలుపు అంత ఈజీ కాదు.. స్వదేశంలో జరిగే టెస్టులు స్పిన్‌ ట్రాక్‌పై జరుగుతుంటాయి. దీంతో విదేశీ ప్లేయర్లు బోల్తా పడుతుంటారు. అటు సఫారీ గడ్డపై మాత్రం పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుంటుంది. ఇలాంటి పిచ్‌పై టీమిండియా స్టార్‌ పేసర్‌, వరల్డ్‌కప్‌ హీరో మహ్మద్‌షమీ(Mohammed Shami) నిప్పులు చెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్న వేళ భారత్‌ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది.

షమీ ఆడడం డౌటే:
దక్షిణాఫ్రికతో తొలి టెస్టు డిసెంబర్‌ 26న జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే గాయంతో షమీ బాధపడుతున్నాడు. నిజానికి షమీ ప్రపంచకప్‌లో గాయంతోనే ఆడాడు. చీలమండ గాయాన్ని పట్టించుకోకుండా,షమీ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లతో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సమయంలో అతని కుడి పాదం నొప్పిగా ఉండేది. అయినా కూడా జట్టు కోసం గాయాన్ని భరించి సత్తా చాటాడు. వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత నుంచి షమీ పునరావాసంలో ఉన్నాడు. ప్రస్తుతం గాయం నుంచి షమీ కోలుకుంటున్నాడని సమాచారం.

ఫ్లైట్‌ ఎక్కని షమీ:
దక్షిణాఫ్రికాతో వన్డేలు, టీ20, టెస్టులకు వేరువేరుగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం టీ20 సిరీస్‌ జరగనుండగా.. వన్డే జట్టుతో కలిసేందుకు దాదాపు స్టార్‌లందరూ దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు, అయితే షమీ ఇంకా వెళ్లలేదు. డిసెంబర్ 15న(రేపు) రోహిత్-విరాట్ కోహ్లీ బయలుదేరనున్నారు. వీరితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారు. శామీర్ వారితో కలిసి సఫారీ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. ఒకవేళ షమీ దక్షిణాఫ్రికాలో ఆడలేకపోతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో సెలక్టర్లు ఇంకా ప్రకటించలేదు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు జనవరి 3న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ స్టేడియంలో జరగనుంది.

Also Read: విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

WATCH:

Advertisment
తాజా కథనాలు