World Cup 2023:సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం

దక్షిణాఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఓవర్లు గడుస్తున్నా రన్ చేయలేకపోవడమే కాదు వరుసగా వికెట్లను కూడా కోల్పోతూ దక్షిణాఫ్రికా అతి చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్కోరు 13 ఓవర్లకు 30/4 వికెట్లు.

New Update
World Cup 2023:సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం

ఏళ్ళు మారుతున్నా...ప్లేయర్స్ మారుతున్నా దక్షిణాఫ్రికా తన పద్ధతిని మాత్రం మార్చుకోవడం లేదు. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ అతి పేలవమైన ఆట తీరును కనబరుస్తోంది. కోలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాంటింగ్ ను ఎంచుకుని బరిలోకి దిగింది. అయితే మ్యాచ్ మొదలై పది ఓవర్లు అయిపోయినా ఈ టీమ్ స్కోరు మాత్రం 20 కూడా దాటలేదు. దానికి  తోడు వరుసగా వికెట్లను కూడా కోల్పోతోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్కోరు 13 ఓవర్లకు 30 పరుగులు, నాలుగు వికెట్లు. అందులో వాళ్ళ మెయిన్ ప్లేయర్ డికాక్ వికెట్ కూడా ఉంది. దీంతో దక్షిణాప్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

Advertisment
Advertisment
తాజా కథనాలు