IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్

మొదటి మ్యాచ్ ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటోంది. రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే సౌత్ ఆఫ్రికాను ఆల్ అవుట్ చేసింది. భారత బౌలర్ ఆరు వికెట్లతో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు.

New Update
IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్

IND vs SA Second Test Match: ఇదీ మన వాళ్ళు అంటే..టీమ్ ఇండియా తలుచుకుంది అంటే అవతలి వాళ్ళు చిత్తు అయిపోవాల్సిందే. బాగా ఆడితే తమను ఢీకొట్టే వాళ్లే లేరని మరోసారి నిరూపించుకుంది టీమ్ ఇండియా. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లలో మొదటి మ్యాచ్ చిత్తుగా ఓడిపోయిన భారత టీమ్ రెండో మ్యాచ్‌లో మాత్రం విజృంభించేస్తోంది. మ్యాచ్ మొదలైన కొంతసేపటికే సఫారీలను పెవిలియన్ బాట పట్టించారు భారత బౌలర్లు.

Also read:గూగుల్ మ్యాప్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్!

కేప్‌ టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్. క్రీజులోకి దిగిన సఫారీ బ్యటర్లను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బెంబేలెత్తించాడు. 9 ఓవర్లలో ఆరు వికెట్లు తీసి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. బుమ్రాకు రెండు, ముకేశ్‌ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్‌ ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్‌ చేశాడు.

Advertisment
తాజా కథనాలు