Kamal Nath: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం..! మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరునున్నారనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కమల్‌నాథ్ తన ఎక్స్ బయోలో కూడా కాంగ్రెస్ పేరును తొలగించారు. ఆయనతో పాటు తన కొడుకు నకుల్ నాథ్ కూడా బీజేపీలో వెళ్తారనే రూమర్స్ వస్తున్నాయి. By B Aravind 17 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kamal nath: లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు కొందరు అసంతృప్తి నేతలు పార్టీలు కూడా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారాలు జోరుగా సాగాయి. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. అయినా దాదాపు కాంగ్రెస్‌ను వీడనున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హస్తం పార్టీతో అసంతృప్తిగా ఉన్నారని.. నాలుగు దశాబ్దాల క్రితం ఆ పార్టీలో చేరినప్పుడు ఆయనకున్న గౌరవం ఇప్పుడు లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోని బయోలో కూడా కాంగ్రెస్ పేరును తొలగించడంతో బీజేపీలోకి చేరనున్నారని ప్రచారాలు సాగుతున్నాయి. Also Read: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే ప్రధాని, అమిత్‌షాలను కలవని కమల్‌నాథ్ అయితే శనివారం ఢిల్లీకి వచ్చిన కమల్‌నాథ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా ప్రధాని నరేంద్ర మోదీని ఇంతవరకు కలవలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు వీడీ శర్మ లాంటి నేతలు మాత్రమే.. కమల్‌నాథ్‌కు పార్టీలోకి ఆహ్వానం ఉంటుందని అంటున్నారు. ఛింద్వారా నియోజవర్గంలోని ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం తనను బీజేపీలోకి చేరమంటున్నారని కమల్‌నాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ మారే విషయం ఇంకా పరిగణలోనే ఉందని సమాచారం. మరోవైపు ఛింద్వారా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కమల్‌నాథ్ కొడుకు నకుల్ నాథ్ కూడా తన తండ్రితో పాటే బీజేపీలోకి చేరనున్నట్లు ప్రచారాలు నడుస్తున్నాయి. కమల్‌నాథ్ అసంతృప్తి..! అయితే కమల్‌నాథ్ తన అసంతృప్తిని కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా వివరించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో బీజీగా ఉన్నారని.. ప్రస్తుతం పార్టీని సీనియర్ నేతలైన జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలాలు మాత్రమే నడుపుతున్నారని కమల్‌నాథ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజ్యసభ ఎన్నికల కోసం నామినేట్ చేయకపోవడంతో కమల్‌నాథ్ అసంతృప్తిగా ఉన్నారని కొందరు భావిస్తుండగా.. అందులో వాస్తవం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాహుల్ గాంధీ రాజ్యసభ ఎన్నికల కోసం.. సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌ను పేరును ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్.. అశోక్ సింగ్ అనే మరో నేతను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టాలని కోరినట్లు సమాచారం. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్.. కమల్ నాథ్‌ను పార్టీ నుంచి వీడొద్దని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. Also Read: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..! అయితే కమల్ నాథ్ ఒకవేళ కాంగ్రెస్‌లోకి చేరితే.. ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగులుతుంది. వాస్తవానికి కమల్ నాథ్ తన జీవితకాలంలో ఎక్కవగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అలాగే తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించాలనే లక్ష్యంగా ఇండియా కూటమి ఓవైపు ప్రణాళికలు రచిస్తోండగా.. బిహర్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరడం, అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆ కూటమిని వీడిన సంగతి తెలిసిందే. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు బీజేపీలోకి చేరుతున్న తరుణంలో.. రాబోయే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ సవాలుగా మారుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. #congress #national-news #bjp #madyapradesh #kamlnath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి