Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా.. రాయ్ బరేలీలో సోనియా గాంధీ ఎమోషనల్!

యూపీ రాయ్ బరేలీ ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని, తమ మధ్య బంధం గంగామాత అంత పవిత్రమైనదన్నారు. 'నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. ఆదరించండి. బరేలీ వాసుల్ని రాహుల్ నిరాశపరచడు' అన్నారు.

New Update
Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా.. రాయ్ బరేలీలో సోనియా గాంధీ ఎమోషనల్!

Raebareli : దేశంలో సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) రాయ్ బరేలీ ప్రచార సభలో భావోద్వేగానికి లోనయ్యారు. రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని, రాహుల్ ఎల్లప్పుడూ మద్ధతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు రాయ్‌బరేలీలోని శివాజీ నగర్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించని బహిరంగ సభలో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. రాయ్ బరేలీ, అమేథీలను ఎప్పటికీ మర్చిపోలేనని, మూడు దశాబ్దాలుగా సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. పేదలకు సేవ చేయడమే తన పిల్లలకు నేర్పించానని, ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న బంధం గంగామాత అంత పవిత్రమైనదని చెప్పారు.

నా బిడ్డ రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా..
అలాగే తనకు జీవితాంతం రాయ్ బరేలీ ప్రజల ఆశీర్వాదం అండగా ఉందని,. తన తరపున రాహుల్ గాంధీ నిలబెడుతున్నట్లు చెప్పారు. 'నన్ను మీలో ఒకరిగా గుర్తించినట్లే రాహుల్ గాంధీని ఆదరించాలి. నా బిడ్డ రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా. రాయ్ బరేలీ వాసుల్ని రాహుల్ నిరాశపరచడు' అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు సోనియా గాంధీ. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాయ్‌బరేలీ ప్రజలతో తమ కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోడానికే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ సభ్యత్యాన్ని, తన ఇంటిని తీసుకున్నారన్నాడు. దర్యాప్తు సంస్థలు విచారించిన తాను బయ పడలేదని, కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి బయటకు పంపినప్పుడు దేశ ప్రజలు తనకు అండగా నిలబడ్డారంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ చెంప పగల గొట్టిన యువకుడు

Advertisment
తాజా కథనాలు