High BP: ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. గుండె జబ్బులు, గుండెపోటు నుంచి స్ట్రోక్ లాంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణం. యువతలో కూడా రక్తపోటు సమస్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, పోషకాలు లేని ఆహారం కారణంగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉండవచ్చు. అన్ని వయసుల వారు రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. అప్పుడే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
ఉప్పు వద్దు:
వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రజల దృష్టిని కేంద్రీకరించడం, వాటి నివారణపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. పెరుగుతున్న రక్తపోటు, గుండె జబ్బుల సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పు ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఆహారంలో సోడియం మొత్తాన్ని సమతుల్యం చేస్తే, అధిక రక్తపోటు ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
సోడియం వద్దే వద్దు:
చైనీస్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం లేదా టేబుల్ ఉప్పును ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం వల్ల అధిక రక్తపోటును 40శాతం తగ్గుతుందని గుర్తించారు. ఉప్పు స్థానంలో దాని ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా, ఆహారంలో పొటాషియం ఉన్న వాటిని ఎక్కువగా చేర్చాలి. సోడియం అధిక రక్తపోటును ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు రక్తనాళాల వాల్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారికి, అధిక ఉప్పు తీసుకోవడం ఈ సమస్యలను మరింత పెంచుతుంది.
ఇది కూడా చదవండి: షాకింగ్ స్టడి..తీపి తింటే కాలేయం కాటికే.. ఎందుకో తెలుసుకోండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.