Soaked Dates: ఈ విధంగా ఖర్జూరం తినండి.. ఒకేసారి 14 రకాల వ్యాధులు పరార్! స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఖర్జూరంలో ఉంటుంది. ఖర్జూరం మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఖర్జూరం వల్ల ఇలా 14 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Soaked Dates: ఖర్జూరాల గురించి చాలామందిలో అపోహలు ఉంటాయి. ఖర్జూరం తింటే శరీరంలో వేడి పెరుగుతందని అంటుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం మాత్రం ఖర్జూరం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో విటమిన్ -సి, విటమిన్ -డి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప సోర్స్. ఖర్జూరం క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఖర్జూరం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే వాటిని నానబెట్టి తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బలహీనతను తొలగిస్తుంది. రక్తహీనతకు మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడుతుంది. హేమోరాయిడ్స్‌ను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. గర్భధారణలో ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మానికి, జుట్టుకు మంచిది. ఖర్జూరం ఎప్పుడు తినాలి: ఉదయాన్నే ఖాళీ కడుపు రోజు అల్పాహారంగా తిసుకోవాలి. రాత్రి పడుకునే ముందు (బరువు పెరగడానికి నెయ్యితో) ప్రతి ఒక్కరు రోజుకు 2 ఖర్జూరాలు తినవచ్చు. బరువు పెరగడం కోసం రోజూ 4 ఖర్జూరాలు తినవచ్చు. అయితే జీర్ణక్రియ సమస్య లేకుండా ఉంటేనే నాలుగు తినాలి. నిజానికి నానబెట్టడం వల్ల ఖర్జూరాలు త్వరగా జీర్ణం అవుతాయి. అందుకే ఖర్జూరాలను తినడానికి ముందు రాత్రంతా (8-10 గంటలు) నానబెట్టండి. ఇది కూడా చదవండి: నరాల సమస్యలు ప్రాణాంతకం అవుతాయా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #soaked-dates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి