Toilets Health Benefits: వెస్ట్రన్ కంటే ఇండియన్ టాయిలెట్స్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? దేశీయ టాయిలెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దేశీయ టాయిలెట్ వల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది. గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలు చేస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Toilets Health Benefits: ఈ రోజుల్లో ప్రజల జీవన విధానం చాలా మారిపోయింది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి జీవనశైలిలో చాలా మార్పులు చేసుకుంటున్నారు. అయితే అవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతున్నాయి. ఇలాంటి వాటిలో వెస్ట్రన్ టాయిలెట్స్ ఒకటి. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ప్రజలు సౌలభ్యం కోసం, ఇంటిని అందంగా ఉంచుకునేందుకు వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. మరికొందరు అయితే భారతీయ మరుగుదొడ్లు మంచివిగా భావిస్తారు. దీని కారణంగా భారతీయ టాయిలెట్ల ట్రెండ్ తగ్గుతోంది. అయినప్పటికీ భారతీయ, వెస్ట్రన్ టాయిలెట్ల గురించి చాలా మందిలో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. భారతీయ టాయిలెట్స్‌తో ఫిట్‌నెస్: వెస్ట్రన్ టాయిలెట్స్ కంటే భారతీయ టాయిలెట్లు ఫిట్‌గా ఉంచడంలో మరింత సహాయపడతాయి. నిజానికి భారతీయ టాయిలెట్లపై కూర్చోవడం వల్ల వ్యాయామం అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. భారతీయ టాయిలెట్‌లో కూర్చున్న విధానం రక్త ప్రసరణను పెంచుతుంది. చేతులు, కాళ్లకు మంచి వ్యాయామం అని నిపుణులు అంటున్నారు. పర్యావరణానికి మంచిది: ఇండియన్ టాయిలెట్స్ పర్యావరణానికి చాలా మంచివి. వాస్తవానికి వెస్ట్రన్ టాయిలెట్స్‌లో కాగితం ఉపయోగిస్తారు. దీనివల్ల పేపర్ వృధా అవుతుంది. భారతీయ టాయిలెట్స్‌లో పేపర్ వృధా కాదు, అంతేకాకుండా వెస్ట్రన్ టాయిలెట్స్‌కి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: భారతీయ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల పొట్ట కుదించుకుపోతుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీనికి విరుద్ధంగా వెస్ట్రన్ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల మన కడుపుపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. కొన్నిసార్లు మల విసర్జన కూడా సరిగా జరగదు. గర్భిణీ స్త్రీలకు మంచిది: భారతీయ టాయిలెట్లు గర్భిణీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే భారతీయ టాయిలెట్లను ఉపయోగించడానికి వారు స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవాలి. ఇది సాఫీగా, సహజ ప్రసవానికి సహాయపడుతుంది. అలాగే దీని వాడకం వల్ల గర్భాశయంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షణ: ఇండియన్ టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల మన శరీరంలోని పెద్దపేగు నుంచి మలాన్ని పూర్తిగా బయటకు పంపుతుంది. ఇది మలబద్ధకం, అపెండిసైటిస్, పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీసే ఇతర కారకాలను నివారిస్తుంది. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న వేల సంవత్సరాల నాటి 7 వైరస్‌లు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #toilets-health-benefits #indian-toilets #western-toilets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి