Snoring : గురకపెట్టే అలవాటు ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా?

గురక.. ఓ శబ్ద పిశాచమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గురకపెట్టే అలవాటు టైప్-2 డయాబెటిస్‌కు సంకేతం.

New Update
Snoring : గురకపెట్టే అలవాటు ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా?

Snoring Problem : ఊబకాయం(Obesity) కారణంగా చాలా మంది గురక(Snoring) తో బాధపడుతుంటారు. అంతే కాకుండా స్థూలకాయం వల్ల మధుమేహం(Diabetes) కూడా వస్తుంది. ఊబకాయం ఇన్సులిన్ చర్యకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా గురక గ్లూకోజ్ జీవక్రియను మారుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది. గురకపెట్టే అలవాటు ఉంటే టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇన్సులిన్‌ పనితీరుపై ప్రభావం:

  • సరైన నిద్ర లేకపోవడం(No Sleep) ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లు కూడా తగినంత నిద్ర లేకపోవడం వల్ల ప్రభావితమవుతాయని నిపుణులు అంటున్నారు. నిద్ర సంబంధిత సమస్యలు కూడా టైప్‌-2 మధుమేహాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

గురక వల్ల కలిగే సమస్యలు:

  • గురక అనేది మధుమేహం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు సమస్య, గుండె సంబంధిత వ్యాధులు(Heart Diseases) రావచ్చని హెచ్చరిస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.

స్లీప్ అప్నియా లక్షణాలు:

  • బలహీనంగా అనిపించడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, మానసిక కల్లోలం లేదా చిరాకు వంటివి ఉంటాయని వైద్యులు అంటున్నారు. రాత్రి పూట గురక పెట్టినప్పుడు శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. గురక పెట్టే వ్యక్తుల ఊపిరితిత్తులు, గుండెపై ఒత్తిడి కలుగుతుందని చెబుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా చేయడం, నిపుణులు సూచించిన మందులు వాడడంతోపాటు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని అంటున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ తీసుకోవద్దని, ఎనిమిది గంటల వరకు మీ శరీరంపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రాత్రిపూట అతిగా తినొద్దని, మద్యం సేవించవద్దని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి : అరగంటలో బ్రెయిన్‌ ట్యూమర్‌కి చికిత్స.. ఖర్చు ఎంతంటే?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు