Rahul Gandhi : ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh), వారణాసి(Varanasi) భవిష్యత్తు గురించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం అమేథీలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వారణాసి మద్యం మత్తులో ఊగూతుందని..యూపీ భవిష్యత్తు అంధకారంలో పడిందని రాహుల్ తన పర్యటనలో అన్నారు.ఈ విషయం గురించి అమేథీ ఎంపీ , కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు స్మృతి స్పందించారు. అంతేకాకుండా రాహుల్ మాట్లాడిన మాటలకు ఆమె సోనియా గాంధీకి సలహాలు ఇచ్చారు.
రాహుల్ మనసులో యూపీపై విషం - స్మృతి
యూపీ, వారణాసికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రకటనపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌పై ఆయన మనసులో ఎంత విషం ఉందో అర్థమవుతోందని అన్నారు. వాయనాడ్‌లో యూపీ ఓటర్లపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రామాలయంలో జరిగే పవిత్రోత్సవానికి ఆహ్వానాన్ని రాహుల్ తిరస్కరించారని స్మృతి చెప్పారు. ఈరోజు ఆయన వారణాసి, ఉత్తరప్రదేశ్ యువతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
స్మృతి కేవలం రాహుల్ గాంధీ మీద మాత్రమే కాకుండా.. సోనియా గాంధీ(Sonia Gandhi) కి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. సోనియానే కానీ తన కుమారుడ్ని మంచిగా పెంచి ఉంటే ఇలా పవిత్ర స్థలం పై ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని పేర్కొన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్ లో ప్రజలే సరైన సమాధానం చెబుతారని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్(Congress) భవిష్యత్ ప్రస్తుతం అంధకారంలో ఉందని, యూపీ అభివృద్ది వైపు పయనిస్తుంటే చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమేథీ(Amethi) లో భారత్ జోడో న్యాయ యాత్ర(Bharat Judo Nyay Yatra) సందర్భంగా యూపీ భవిష్యత్తుపై ప్రశ్నలు సంధిస్తూ వారణాసిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను వారణాసికి వెళ్లానని, అక్కడ రాత్రి వేణువు వాయిస్తున్నారని, తాగి రోడ్డుపై పడుకుని వేణువు వాయిస్తున్నారని చూశానని చెప్పాడు. యూపీ భవిష్యత్తు రాత్రి పూట తాగి నాట్యం చేస్తోందన్నారు.
Also Read : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది!