Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా? రోజూ 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం, జీవక్రియ రేటును తగ్గం, శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Smoking Kills Health : ధూమపానం(Smoking) క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని మనందరికీ తెలుసు. కానీ మన ఆధునిక జీవనశైలిలో మనం నిర్లక్ష్యం చేస్తున్న మరో ప్రమాదకరమైన అలవాటు కూడా ఉంది. కంప్యూటర్లు, డెస్క్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసే డిజిటల్ యుగం(Digital Era) ఇది. రోజూ 10 నుంచి 12 గంటలు కూర్చోవడం, ఆఫీసులో పని చేయడమే కాదు టీవీ చూడటం లేదా సోషల్ మీడియా(Social Media) లో గడపడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో వివిధ రకాల క్యాన్సర్(Types Of Cancer) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం పడుతుందని, జీవక్రియ రేటును తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ క్యాన్సర్ పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఎక్కువసేపు కూర్చుంటే: ఎక్కువసేపు కూర్చోవడం(Continue Sitting) వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ: ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో రక్త ప్రసరణ సరిగా జరగదు. కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు ఇచ్చే సలహా: నిత్యం నడక(Walking), వ్యాయామం(Exercise) చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కూర్చొని పని చేస్తూనే లేచి మధ్యలో కొంచెం నడవాలని, అలాగే రోజూ కొంత వ్యాయామం లేదా యోగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి : పిల్లలు బక్కగా ఉన్నారా? సెమోలినాతో ఇలా చేస్తే బొద్దుగా..పొడుగ్గా కావడం గ్యారెంటీ గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్..ఇలా చేసుకోండి #health-tips #health-benefits #cancer #health-care #smoking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి