ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే కొంతమంది వ్యాయామం చేస్తారు.. మరికొందరు లైట్ తీసుకుంటారు. అయితే కనీసం ఉదయం పూట పదినిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా ఆరోగ్యానికి మంచిదని నిపుణలు చెబుతున్నారు. దీనికి మహిళలు, పురుషులకు ఎలాంటి మినహాయింపు లేదు. ఎవరైనా స్కిప్పింగ్ చేయవచ్చు. ఇక నిపుణలు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే.. ప్రతిరోజూ ఉదయం ఒక 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. జీవక్రియ కూడా త్వరగా ప్రారంభమవుతుంది. ఇతర వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం ఒక్క స్కిప్పింగ్ చేసినా కూడా ఫిట్‌నెస్ ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు స్కి్ప్పింగ్ అనేది గుండెకు చాలా మంచి వ్యాయామం. శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వును కూడా తొలగించేసుకోవచ్చు.
అలాగే స్కిప్పింగ్ చేస్తే మనస్సు, శరీరం చరుకుగా పనిచేస్తాయి. ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తే అధిక బరువును కూడా నియంత్రించుకోవచ్చు. ఇలా ఉదయం పూట స్కిప్పింగ్ చేయడం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి చాలామంది ఉబకాయం సమస్యతో బాధపడుతుంటారు. ఇది తగ్గించుకోవడం కోసం కసరత్తులు చేస్తుంటారు. అయితే స్కిప్పింగ్ కూడా ఉబకాయాన్ని నియంత్రించేందుకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. మరో విషయం ఏంటంటే స్కిప్పింగ్ చేసిన తర్వాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు కాళ్లు, కండరాలు బలిష్టంగా మారిపోతాయి.
Also Read: ఈ పండు తింటే..ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..!
స్కిప్పింగ్ చేసేటప్పుడు మన ఉదరభాగం లోపలికి, బయటకు వెళ్తుంది. దీనివల్ల ఉదరభాగంలో ఉన్నటువంటి అదనపు కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా చిన్నవయసులో ఉన్నవారు స్కిప్పింగ్‌ను అలవాటు చేసుకోవాలి. ఇది చేయడం వల్ల భుజాలు బలంగా, గుండ్రంగా మారుతాయి. స్కి్ప్పింగ్ చేస్తున్నప్పుడు చేతిమడమలను తిప్పడం వల్ల వేళ్లకు బలం వస్తుంది. అలాగే మెదడు విశ్రాంతిగా ఉంటుంది. శరీరం కూడా ధృఢంగా తయారవుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. కళ్లు, పాదాలు, చేతులకు సమన్వయం పెరగడంతో చురుకుగా స్పందిస్తారు. క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేసేవారికి శారీరక బలం పెరగడంతో పాటు ఎముకలు గట్టిపడతాయి. అలాగే బీపీ, షుగర్ వ్యాధులు కూడా అదుపులోకి వస్తాయి.