ఉదయం కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం టీ కానీ కాఫీ తోపాటు అల్పాహారం తీసుకోవడం చాలా మందికి అలవాటు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. అంతేకాదు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు ఆకలి అదుపులో ఉంటుంది. అంతేకాదు శరీర బరువును కూడా అదుపులో ఉంచుకునేందుకు బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉండటంతోపాటు నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ సక్రమంగా తగ్గిపోతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా మంచిది.
ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయనట్లయితే...శరీరంలోని చక్కెర స్థాయిలు క్రమంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది ఇతర సమస్యలకు దారి తీసింది. అల్పాహారం స్కిప్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తోపాటు ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఊభకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటితోపాటు గుండెపోటు ప్రమాదం కూడా లేకపోలేదు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల జీవక్రియ అసమతుల్యతతో ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందదు. దీంతో శరీరం అలసట, నీరసానికి గురవుతుంది.
జీవక్రియ నెమ్మదిస్తుంది:
ఉదయం జీవక్రియ తక్కువగా ఉంటుంది. అల్పాహారం తీసుకోకుంటే రక్తంలో చక్కెర్ స్థాయి తగ్గుతుంది. దీంతో ఆకలి, కోపం ఎక్కువైతుంది. అంతేకాదు ఎసిడిటి వేధిస్తుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు కడుపులో ఏమీ లేకుంటే యాసిడ్స్ విడుదలవుతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో పోషకాలు లోపిస్తాయని పలు అధ్యయానాల్లో ఇప్పటికే తేలింది.
గుండె జబ్బులు:
ఉదయం అల్పాహారం తీసుకునేవాళ్లతో పోల్చితే..తీసుకోని వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 27శాతం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండెజబ్బుల రిస్క్ నుంచి బయటపడవచ్చు. టిఫిన్ తినకపోవడం వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ తో రోజూను ప్రారంభించకపోతే అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనవచ్చు.
పీచు పదార్థాలు ఎక్కువగా:
మనం ప్రతిరోజూ ఉదయం తినే అల్పాహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం తినే అల్పాహారం సాయంత్రం వరకు శరీరానికి శక్తిని ఇస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ముఖ్యంగా పీచు పదార్థలు, కొవ్వు తక్కువగా ఉండే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో సమతుల్యఆహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.
గుడ్లు:
పీచు పదార్థాలతోపాటు గుడ్లను కూడా చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందుతుంది. మాంసకృత్తులతోపాటూ విటమిన్లు, ఖనిజాలు కూడా శరీరానికి అందుతాయి. ముఖ్యంగా తృణ ధాన్యాలతో చేసిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.
జ్యూసులు:
మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులు జ్యూసులు తీసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటికి బదులుగా ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవడం మంచిది. మనలో చాలా మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.