Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది.

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం... రాష్ట్ర అధ్యక్షుడి మార్పు!
New Update

AP Skill Scam Case: ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ కేసును ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9న తనకు మరో కేసు ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలపగా.. ఫిబ్రవరి 12కు వాయిదా వేయాలని హరీశ్‌ సాల్వే విజ్ఞప్తి చేయడంతో.. ధర్మాసనం అంగీకరించింది. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 12న జరగనుంది.

Also Read: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

ఫైబర్ నెట్ కేసులో సుప్రీం ట్విస్ట్..

ఫైబర్ నెట్ కేసు(Fiber Net Case) లో టీడీపీ అధినేత చంద్రబాబు కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసులో గతంలో ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన చంద్రబాబు కేసును ఈ రోజు విచారించలేమని తెలిపారు. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. 

Also Read: సీఎం జగన్ తో RGV భేటీ

అసలేంటీ ఫైబర్ నెట్ కేసు..

టెర్రా సాఫ్ట్ కంపెనీ(Terra Soft Company) కి నిబంధనలకు విరుద్దంగా… కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు చేసింది. అప్పటికే టెర్రా సాఫ్ట్ కంపెనీ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని.. మొత్తం రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.114. 53 మేర అవినీతి జరిగిందని తేల్చినట్లు సీఐడీ(CID) పిటిషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్-2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా సాంబశివరావు పేర్లను చేర్చినట్లు తెలిపింది. ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీలను తక్కువ ధరకు అందించే నిమిత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏ-25 నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ సీఐడీ మెమో(Memo) ధాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో వేసిన పీటీ వారెంట్‌కి అనుబంధంగా ఈ మెమో జతపర్చింది. సంబంధిత శాఖను తన వద్ద ఉన్నప్పుడే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని సీఐడీ ఆరోపించింది. A-1 వేమూరి హరికృష్ణని టెండర్ ప్రాసెస్ కమిటీలో సభ్యుడిగా నియమించేలా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారనే అభియోగం మోపింది. మెస్సర్స్ పేస్ పవర్ అనే సంస్థ ఈ ప్రక్రియను తప్పు పట్టినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. నాసిరకం మెటీరియల్, 80 శాతం ఫైబర్ కేబుల్ పనికి రాకుండా పోయిందని తెలిపింది. ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్‌తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపైనా చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

DO WATCH: 

#cm-jagan #ap-latest-news #ap-skill-development-case #chandrababu-bail #skill-scam-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe