Train Accident: కలవరపెడుతున్న రైలు ప్రమాదాలు.. ఒక్క నెలలోనే ఆరు ఘటనలు

ఈ మధ్యకాలంలో వరుస రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో ఈ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఒక్క జులై నెలలోనే వరుసగా ఆరు రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది.

New Update
Train Accident: కలవరపెడుతున్న రైలు ప్రమాదాలు.. ఒక్క నెలలోనే ఆరు ఘటనలు

ఈ మధ్యకాలంలో వరుస రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికులకు భద్రత కరువైపోవడం కలకలం రేపుతోంది. ఎన్నో కుటుంబాల్లో ఈ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖ రైల్వే స్టేషన్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మూడు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా ప్రాంతం నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీ7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Also Read: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం

అయితే ఒక్క జులై నెలలోనే వరుసగా ఆరు రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జులై 14న పశ్చిమ బెంగాల్‌లోని ఖార్డాలో రైలు ప్రమాదం జరిగింది. ఓ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొంది. 8 బోగీలను ఢీకొనడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్‌లో మరో ప్రమాదం జరిగింది. చండీగఢ్-దిబ్రూగడ్ రైలుకు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి పైగా గాయాలయ్యాయి.

జులై 19న గుజరాత్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వల్సడ్ నుంచి సూరత్ స్టేషన్ల మధ్య ఆ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 21న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రోహా మీదుగా ఢిల్లీ వైపు ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా మూడు బోగీలు బోల్తాపడ్డాయి. మరో మూడు బొగీలు పట్టాలు తప్పాయి.

Also Read: మరికొద్ది గంటల్లో మూడోప్రపంచ యుద్ధం.. ఇండియన్ నోస్ట్రడమస్ అంచనా!

జులై 29న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. దర్బంగ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. ఇంజిన్ నుంచి బోగీలు వీడిపోయాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జులై 30న జార్ఘండ్‌లోని బారాబంబో వద్ద రైలు పట్టాలు తప్పింది. హౌరా - ముంబై మెయిల్‌కు చెందిన రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు