ప్రస్తుతం టెక్ ప్రపంచంలో వినిపిస్తున్న మాట 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'. టెక్ సెక్టార్లోనే కాదు ఆర్టిస్టుల ఊహల్లో కూడా. ఈ జనరేటివ్ ఏఐ సహాయంతో ఇప్పటికే రూపొందుతున్న ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పుల్ ట్రెండ్‌గా మారుతున్నాయి. ఈ ఏఐ టూల్స్‌తో ఎలాంటి కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నా.. యూజర్లకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. దీంతో ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో, మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన లేటెస్ట్ హుక్ స్టెప్స్‌కి సంబంధించి ఇతర హీరోయిన్లు ఏమి చేస్తారని అడుగుతూ ఈ AI టూల్స్‌తో చాలా వీడియోలు రూపొందించారు .
రజనీకాంత్ 'జైలర్'లో తమన్నా ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో తమన్నా వేసిన హుక్ స్టెప్ బాగా పాపులర్ అయ్యింది. ఇది ప్రతిచోటా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో తమన్నా హుక్ స్టెప్స్ క్రియేట్ చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఇద్దరు డ్యాన్సర్లతో ఆమె వేసిన స్టెప్పులు ట్రెండ్ అయ్యాయి. కానీ ఇప్పుడు చాలా మంది నెటిజన్లు హుక్ స్టెప్స్ కోసం AI టూల్స్ ఉపయోగించి వీడియోలను రూపొందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ , డ్యాన్స్‌ను రూపొందించి వీడియోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు .. ఆశ్చర్యపోతున్నారు. వినూత్య ఆలోచన అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తమన్నా రజనీకాంత్ 'జైలర్' చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్ సునీల్ రామకృష్ణ సహా పలువురు తారలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 10 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా గతవారం ‘కావలా కావాలా’.. అనే సాంగ్ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. అలా ఈ పాట పాపులర్ అయింది. ఇప్పటివరకు 2కోట్లపైగానే ఈ వీడియోను వీక్షించారు. ప్రతిచోటా ఇదే పాట వవినిపిస్తోంది. ఈ పాటలో తమన్నా గ్లామర్ డ్యాన్స్ అందరినీ పిచ్చెక్కించేలా చేసింది. తమన్నా వేసిన స్టెప్పులకు రీల్స్ చేస్తున్నారు నెటిజన్స్.