OTT vs Silver Screen: వెండితెర సవాళ్లు 2023.. ఓటిటి vs సినిమా

కొన్నేళ్లుగా (OTT) ఓటిటి ధాటికి వెండితెర వెలవెల బోయింది.ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది?

OTT vs Silver Screen: వెండితెర సవాళ్లు 2023.. ఓటిటి vs సినిమా
New Update

OTT vs Venditera : గతకొన్నేళ్లల్లో సినీ వినోద రంగంలో చాలా మార్పులొచ్చాయి.ముఖ్యoగా కరోనా తరువాత వెండితెర ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. వినోద రంగంలో వచ్చిన (OTT) ఓటిటి సాంకేతిక విప్లవం ధాటికి సినిమా రంగం వెలవెల బోయింది. చిన్నాచితకా సినిమా థియేటర్స్ ఫంక్షన్ హాల్స్ గా మారడం చూస్తున్నాం. కోవిడ్ 19 దెబ్బకు కుదేలయిన టాలీవుడ్ అఖండ (AKHANDA) సినిమాతో మళ్ళీ కొత్త జోష్ తో ముందుకు పోతోంది. ఎన్ని ఓటిటి మాధ్యమాలు వచ్చినా సినిమా థియేటర్లో చూసిన కిక్కే వేరప్పా అంటూ జనాలు మళ్ళీ థియేటర్స్ బాట పట్టారు. అలా .ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది? ఇప్పటికే పైరసీ ధాటికి గజగజ వణికిపోతోన్న సినిమా రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంది.

ఓటిటి వల్ల సినిమా రంగానికి నష్టమా ? లాభమా ?

కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే నానుడి మనకు తెల్సిందే. ఏ మాధ్యమం అయినా వచ్చిన కొత్తల్లో భయపడిపోవడం, విమర్శించడం మనం చూస్తూనే ఉన్నాం . ఎఫ్ఎం (FM) రేడియో వచ్చిన కొత్తల్లో ఆడియో (AUDIO) కంపెనీలు బయాందోళనలకు గురయ్యాయి. ఆ తరువాత ఆయా సినిమాల్లో పాటల పబ్లిసిటీకి ఎఫ్ఎం రేడియోలు ప్రముఖ్ పాత్ర పోషిస్తున్నాయి. అలానే ఓ టి టి మాధ్యమం కూడా మొదట్లో నిర్మాతలకు బెంబేలెత్తించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అదే ఓటిటి రంగం నిర్మాతల పాలిట వరంగా మారింది. ఇంతముందు నిర్మాత సినిమా రిలీజ్ చెయ్యాలంటే చుక్కలు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కంటెంట్ కాస్త బాగుంటే ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ లో ధైర్యంగా రిలీజ్ చేసుకునే వీలుంది. ఇక .. పెద్ద సినిమాకు కూడా ఓటిటి ఒక సపరేట్ ఎక్ట్రా ఇన్కమ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాలకు కోట్లలో బిజినెస్ అవుతోంది. ఇక.. సినిమా ఎంజాయ్ చేసే ఆడియన్స్ మొదటి నుంచి వివిధరకాలుగా ఉంటారని తెలిసిందే. టీవీల్లో సినిమా ఎంజాయ్ చేసే అడియన్స్ , థియేటర్స్ లో ఎంజాయ్ చేసే ఆడియన్స్ , యూట్యూబ్ , ఓ టి టి మాధ్యమాల్లో ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉండటం వలన సినిమా నిర్మాణ రంగంలో కొత్త పోకడలకు నాంది పలికింది అని చెప్పొచ్చు. ఏ మాధ్యమానికి ఉపయోగపడే కంటెంట్ ఆయా మాధ్యమాలకు సరిపడేటట్లు టెక్నాలజీ ఉపయోగిస్తూ .. అందుకు తగ్గ నిర్మాణ వ్యయాన్ని మాత్రమే కేటాయిస్తూ లాబాల బాట పడుతున్నారు. ఇక.. దర్శకులు , ఇతర సాంకేతిక నిపుణులకు అయితే చేతినిండా పని దొరుకుతూనే ఉంది.

ALSO READ:NEW YEAR 2024 PARTY: పార్టీ లేదా పుష్పా ..? న్యూ ఇయర్ పార్టీ ఇలా చేస్తే రిస్క్ ఉండదు.

తెలుగు సినిమా విశ్వవ్యాప్తం

తెలుగు సినిమా స్థాయిని లోకల్ టు గ్లోబల్ గా మార్చిన ఘనత రాజమౌళికి దక్కింది. స్టేట్ అవార్డ్స్ నుంచి ఆస్కార్ విజేతలను అందించిన తెలుగు సినిమా 2023 లో మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. ఎన్ని ఓటిటి మాధ్యమాలు వచ్చినా వెండితెరకే అగ్రతాంబూలం ఇస్తూ ప్రేక్షకులు సినిమా స్థాయిని ఆస్కార్ వరకూ తీసుకెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి (CHIRANJEEVI) వాల్తేరు వీరయ్య , నటసింహం బాలకృష్ణ (BALAKRISHANA) వీర సింహారెడ్డి చిత్రాలతో 2023 కు శుభారంభం పలికిన టాలీవుడ్ ఇక.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బలగం , మ్యాడ్ లాంటి చిన్న చిత్రాలు కూడా బాక్స్ఆఫీస్ వద్ద తమ స్టామినా చూపించాయి. ఇయర్ ఎండింగ్‌లో నాని (NANI) హాయ్ నాన్న , ప్రభాస్ (PRABHAS) సలార్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. .ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా ఆకట్టుకుంది.

థియేటర్స్ మాదిరిగానే ..వారం వారం ఓటిటీల్లో సినిమాలు రిలీజ్

ఇక..వారం రారం సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతున్నవిధంగానే .. ఓ టి టి లో సైతం వారం వారం సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. థియేటర్స్ లో రిలీజ్ అయిన పతీ సినిమా ఓ టి టి లో రిలీజ్ అవుతుండటంతో సినిమా నిర్మాతలు పెరిగారు.
సినిమాలు చూసే జనాల దృష్టిలో ఖచ్చితమైన మార్పులు వచ్చాయని చెప్పొచ్చు . అందుకోసమే సరికొత్త కంటెంట్స్ తో సినిమాలను నిర్మిస్తున్నారు నిర్మాతలు.గతంలోలా బిజినెస్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు.విచిత్రం ఏంటంటే .. ఒక్కో వారం ఓ టి టీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే .. మంచి సినిమాను మాత్రం థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే .. వెండితెరకు ఓటిటి గట్టి పోటీ అని చెప్పొచ్చు. అంతేకాని ఓటిటి వల్ల వెండితెరకు కానీ , సినిమానే నమ్ముకున్న లక్షలాది కుటుంబాలకు కానీ ఎలాంటి నష్టమూ లేదు. ఈ పరిణామం రాబట్టే .. తెలుగు సినిమా లోకల్ టు గ్లోబల్ అయింది. సవాళ్ళను అధిగమిస్తోంది. సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటోంది.

ALSO READ:HAPPY NEW YEAR  2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం

#prabhas #megastar-chiranjeevi #salar #hi-nanna #nnandamuri-balakrishana #akhanda #ott-vs-telugu-cinima #veerasimhareddy #valteruveerayya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe