సైమా అవార్డుల వేడుకకు సర్వం సిద్ధం..తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆర్‌ఆర్ఆర్!

తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల వేడుకకు మొత్తం సిద్ధం అయ్యింది.

సైమా అవార్డుల వేడుకకు సర్వం సిద్ధం..తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆర్‌ఆర్ఆర్!
New Update

SIIMA Awards 2023 : తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల(SIIMA Awards) వేడుకకు మొత్తం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 2 వ వారంలో దుబాయ్‌ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ -2023 కోసం పోటీపడే సినిమాల లిస్ట్‌ అల్రెడీ రెడీ అయ్యింది.

తెలుగు చిత్రపరిశ్రమని ఆస్కార్ వేదిక మీద తలెత్తుకునేలా చేసిన ఆర్ఆర్‌ఆరా్‌ చిత్రం (RRR Movie) ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్‌ దక్కించుకుని సత్తా చాటింది. కన్నడ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు కాంతార, కేజీఎఫ్‌ 2(KGF 2) కూడా 11 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. సీతారామం , పీఎస్‌ 1 చిత్రాలు కూడా సుమారు 10 విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నాయి.

బెస్ట్ సినిమా విభాగానికి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్‌ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్‌ యాక్ట్ చేసిన కార్తికేయ 2, అడవి శేష్‌ మేజర్‌ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్‌ నటించిన సీతారామం చిత్రం కూడా బరిలో నిలిచింది.

ఇక కన్నడ పరిశ్రమ నుంచి కాంతార(Kantara), కేజీఎఫ్‌ 2, 777 చార్లీ, లవ్‌ మాక్ టెయిల్‌ , విక్రాంత్‌ రోనా సినిమాలు ఉత్తమ కన్నడ చలనచిత్ర అవార్డు 2023 కోసం పోటీ పడుతున్నాయి.

సైమా 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
www.siima.in

Also Read: జులై బాక్సాఫీస్ రివ్యూ

#rrr-movie #tollywood #kgf-2 #charlie-777 #mollywood #siima-awards #dubai #kantara #south-indian-international-movie-awards #siima-awards-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి